• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'అన్నా చెల్లెళ్లు...

'అన్నా చెల్లెళ్లు బీజేపీని వదిలి మా మీద పడ్డారేంటి'

By - Tupaki Desk
Update: 2019-05-08 14:30 GMT
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - ఆయన చెల్లెలు - ఆ పార్టీ ముఖ్య నేత ప్రియాంక వాద్రాల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు ఢిల్లీ ముఖ్యమంత్రి - ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో రాహుల్ గాంధీ - ప్రియాంకలు పనిగట్టుకుని ప్రచారం చేస్తుండటం పట్ల కేజ్రీవాల్ అసంతృప్తితో ఉన్నాడు. ఈ విషయంలో ఆయన ఓపెన్ గానే అసహనం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ఓడించాలంటూ కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ బీజేపీ - కాంగ్రెస్ - ఆప్ ల మధ్యన త్రిముఖ పోరు నెలకొంది. ఒకప్పుడు తమకు అనుకూల ప్రాంతం అయిన ఢిల్లీలో పట్టు మళ్లీ సాధించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.  అయితే ఇప్పటికే ఢిల్లీలో తిరుగులేని శక్తిగా ఉన్న ఆప్.. కాంగ్రెస్ తీరుపై మండి పడుతూ ఉంది.

వాస్తవానికి ఈ ఇరు పక్షాలూ బీజేపీ వ్యతిరేకత అనే ఆయుధంతో ఏకం కావాలని చూశాయి. పొత్తుకు రెడీ అనుకున్నాయి. అయితే ఎవరికి వారు గొంతెమ్మ కోరికలతో వీరి పొత్తు పొడవలేదు. ఆ విషయంలో రాహుల్ గాంధీ - కేజ్రీవాల్ లు ట్విటర్ వేదికగా బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు.

ఇక ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ నేతల ప్రచారం వల్ల ఆప్ అభ్యర్థులు ఓడిపోయే అవకాశం ఉందని కేజ్రీవాల్ అంటున్నారు. 'కాంగ్రెస్ వాళ్లు ఏ మధ్య ప్రదేశ్ మీదో - రాజస్తాన్ మీదో కాన్సన్ ట్రేట్ చేయాలి, కానీ ఇలా ఢిల్లీ మీద పడటం ఏమిటి?' అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఎన్నికల పోరు సాగుతూ ఉందని, రాహుల్ - ప్రియాంకలు ఆ రాష్ట్రాల మీద దృష్టి సారించి బీజేపీని ఓడించాలని.. ఇలా ఆప్ ను ఓడించేందుకు రావడం ఏమిటని కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం కేజ్రీవాల్ మాటలను పట్టించుకోవడం లేదు!
Tags:    
  • Aravind Kejriwal 
  • Priyanka Gandhi 
  • Rahul Gandhi 

Similar News

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

వైసీపీని 'ఓటు' బ్యాంకు కాపాడిందా?!

2026-11-03 17:30 GMT

కోయ ప్రవీణ్...వైసీపీకి ఆయన కఠినం కానీ !

2026-11-03 17:00 GMT

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

తిండి క‌ల్తీ.. నెయ్యి క‌ల్తీ.. స‌మాజం క‌ల్తీ.. లైసెన్సులు ర‌ద్దు చేస్తున్న FDA

2026-11-03 14:30 GMT

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS