టెక్ సంచలనం.. ఆపిల్ 12 వచ్చేసింది.. ధర ఎంతంటే?

Update: 2020-10-14 04:30 GMT
టెక్ దిగ్గజం ఆపిల్ ఫోన్లు వస్తున్నాయంటే చాలు.. ఆ హడావుడి ఓ రేంజ్ లో ఉంటుంది. అగ్ర సినీ తారల సినిమా విడుదలైతే ఎలాంటి సందడి ఉంటుంది.. అంతకు మించిన పండుగ వాతావరణం టెక్ ప్రియుల్లో ఉంటుంది. ఆపిల్ ఫోన్ కొనే వారు మాత్రమే కాదు.. ఫోన్ మీద అవగాహన ఉన్న వారంతా ఒక లుక్ వేయటం.. తాజా ఆపిల్ ఫోన్ ప్రత్యేకతలు ఏమిటి? ధర ఎంత? లాంటి అంశాల మీద విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తారు.అది కూడా ప్రపంచ వ్యాప్తంగా. అందుకే.. యాపిల్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయంటే చాలు.. ప్రపంచమంతా దాని గురించే మాట్లాడుకుంటుంది. ఈ సందడి ఫోన్ లాంచింగ్ కు నెల నుంచి మొదలై.. మార్కెట్లోకి కొత్త ఉత్పత్తి వచ్చిన రెండు వారాల పాటు కొనసాగుతుంది.

అంతేనా.. ఈ ఫోన్ కోసం రోజు ముందే ఆపిల్ స్టోర్ ముందు క్యూలో నిలుచోవటం పాత విషయం. కరోనా నేపథ్యంలో పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చినా.. ఈసారి విడుదల చేస్తున్న ఆపిల్ 12 మీద బోలెడంత బజ్ నెలకొంది. ఈసారి విడుదల చేసిన ఐఫోన్ 12 నాలుగు వేరియంట్లలో విడుదల చేయటం.. 5జీ నెట్ వర్క్ కు పని చేసేలా దీన్ని రూపొందించారు. మార్కెట్లోకి లాంఛ్ అయిన ఈ ఫోన్ ధర ఎంత ఉంది? ఐ12లో ఎన్ని మోడళ్లు ఉన్నాయి? ఏయే రంగుల్లో ఈ ఫోన్ ను విడుదల చేశారు? లాంటి వివరాలు చూస్తే.. బోలెన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి.

ఐఫోన్ 12 మొత్తం నాలుగు వేరియంట్లలో విడుదల చేశారు.
1. ఐఫోన్ 12
2. ఐఫోన్ 12 మినీ
3. ఐఫోన్ 12 ప్రో
4. ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్

ఈ నాలుగింటికి సంబంధించి ఒక్కో ఫోన్ ఒక్కో పరిమాణంలో ఉంటుంది. మినీ పరిమాణం 5.4 అంగుళాలు ఉంటే.. ఐఫోన్ 12 స్క్రీన్ 6.1 అంగుళాలు.. ప్రో మ్యాక్స్ తెర అయితే ఏకంగా 6.7 అంగుళాలు ఉంటుంది. వీటి ధర 699 డాలర్ల నుంచి మొదలై.. 1099 డాలర్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. భారత్ లో వీటి ధర ఎంతన్నది ఇప్పటికి వెల్లడించలేదు. ఐఫోన్ 12 సిరీస్ లో నలుపు.. తెలుపు.. ఎరుపు.. బ్లూ.. గ్రీన్ కలర్లలో విడుదల చేశారు.

ఐపోన్ 12 మినీ 699 డాలర్లు.. ఫోన్ 12 ధర 799 డాలర్లు.. ఐఫోన్ 12 ప్రో 999 డాలర్లు.. ఐపోన్ 12 ప్రో మాక్స్ ధర 1099 డాలర్లుగా ధరల్ని నిర్ణయించారు. ప్రస్తుతం మ్యాక్ కంప్యూటర్లలో మాత్రమే ఉండే మాగ్రటిక్ సేఫ్ టెక్నాలజీని తాజా సిరీస్ ఫోన్లకు ఉంది. దీంతో పవర్ కనెక్టర్ వైర్ లెస్ ఛార్జింగ్ కు సపోర్టు చేయనుంది.

ఐఫోన్ 11తో పోలిస్తే.. తాజా 12 ఫోన్ 11 శాతం నాజూకైనది.. 16 శాతం తేలికైనదిగా చెబుతున్నారు. వీటి కెమేరాల సామర్థ్యం కూడా రెట్టింపు ఉంటుంది. ఐపోన్ 12 మినిలో డ్యూయల్ కెమేరా ఉంది. మిగిలిన మూడు ఫోన్లలో ట్రిఫుల్ కెమేరాలు ఉన్నాయి. ఈ సిరీస్ ఫోన్లను దృఢమైన సెరామిక్ షీల్డ్ తో తయారు చేశారు. ఇది అవసరమైతే 5జీలోనూ..లేదంటే 4జీలోనూ పని చేసేలా రూపొందించారు. ఐఫోన్ బాక్స్ లో ఇకపై అడాప్టర్ ఉండదని యాపిల్ చెబుతోంది. తాజా ఫోన్ ను తాము అత్యంత వేగవంతమైన.. అధునాతనమైన సాంకేతికతతో తయారు చేసినట్లుగాచెబుతున్నారు. ఈ కొత్త ఫోన్లను 6 నుంచి ప్రీ ఆర్డర్లు.. 23 నుంచి డెలివరీలు షురూ కానున్నాయి.
Tags:    

Similar News