కరోనా ఎఫెక్ట్: కౌలాలంపూర్ లో చిక్కుకున్న ఏపీ స్టూడెంట్స్
ఫిలిప్పీన్స్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న తెలుగు విద్యార్థులు సుమారు 200 మంది మలేసియాలో చిక్కుకుపోయి ఇబ్బందిపడుతున్నారు. కరోనావైరస్ నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడమే కాకుండా విదేశీ విద్యార్థులు 72 గంటల్లోగా తమతమదేశాలకు వెళ్లిపోవాలని సూచించడంతో వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. కానీ... ఫిలిప్పీన్స్ నుంచి వచ్చే క్రమంలో మధ్యలో మలేసియాలోని కౌలాలంపూర్ లో విమానాల రాకపోకలు నిలిపి వేయడంతో వారంతా చిక్కుకుపోయారు.
కౌలాలంపూర్‌లో అధికారులు విద్యార్థులను వెనక్కు వెళ్లిపోవాలని సూచించారు.. కానీ, ఫిలిప్పీన్స్ వెల్లేందుకు వారికి ఆ దేశ అధికారులు నో చెబుతుండడంతో కౌలాలంపూర్ లో చిక్కుకుపోయారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విద్యార్థులు కోరుతూ ఈ మేరకు వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే.. భారత ప్రభుత్వం కూడా ఫిలిప్పీన్స్, మలేసియాల నుంచి విమానాల రాకపోకలను ఆపేయడంతో పరిస్థితి జటిలంగా మారింది.
కాగా ఇప్పటికే వందలాది మంది కౌలాలంపూర్‌లో చిక్కుకుపోగా తాజాగా మరో విమానం ఫిలిప్పీన్స్ నుంచి కౌలాలంపూర్ వస్తోంది. అందులోనూ ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. కౌలాలంపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల్లో ఏపీలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల వారు.. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ జిల్లాల విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు.
చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను రప్పించడానికి చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం దిల్లీలోని ఏపీ భవన్ అధికారులను ఆదేశించారు. దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి విజయసాయిరెడ్డిని ఈ బాధ్యతలు చూడమని సూచించారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ, ఎంబసీల అధికారులతో ఏపీ అధికారులు సంప్రదిస్తున్నారు.