మాజీ సీఐ మనసులో మాట: రియాక్ట్ కాకపోతే రెబలేనా..!
అయినప్పటికీ.. తనను పార్టీ పట్టించుకోవడం లేదని ఆయన చెబుతున్నారు. పార్టీలో ఏమాత్రం తనకు విలువ లేకుండా పోయందని ఆవేదన వ్యక్తం చేశారు.;
వైసీపీలో వివాదాస్పద నాయకుడిగా.. వివాదస్పద `ఎంపీ`గా పేరు తెచ్చుకున్న మాజీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్.. గోరంట్ల మాధవ్.. పార్టీపై కస్సుబుస్సులాడుతున్నారు. తను పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నానని.. తెగించి మరీ కూటమి సర్కారుపై విరుచుకుపడుతున్నానని అంటున్నారు. అయినప్పటికీ.. తనను పార్టీ పట్టించుకోవడం లేదని ఆయన చెబుతున్నారు అని అంటున్నారు. పార్టీలో ఏమాత్రం తనకు విలువ లేకుండా పోయందని ఆవేదన వ్యక్తం చేశారు!.
''బోడి రాజకీయాల కోసం.. నా ఉద్యోగాన్ని త్యాగం చేశానని ఇంట్లో వాళ్లు తిడుతున్నారు. ఇప్పటికి సుభ్రం గా ఏసీపీ అయ్యేవాడిని.'' అని తన మనసులో మాటను ఇటీవల ఆయన పార్టీ నాయకుల ముందు వెళ్లగ క్కేశారు. వచ్చేఎన్నికల్లో తనకు ఎంపీ సీటు ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. వాస్తవానికి వ్యక్తిగత వ్యవహారంతో గత ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన మాధవ్.. పార్టీలో గత రెండు ఏళ్లుగా యాక్టివ్‌గా ఉంటున్నారు. నాయకుల అరెస్టులు.. కేసులు వంటివి తెరమీదికి వచ్చినప్పుడు రాజకీయంగా దూకుడు పెంచుతున్నారు.
గతంలో పలువురు కీలక నాయకులు అరెస్టయినప్పుడు.. ఆయన వచ్చి హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. కూటమి సర్కారుకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా.. కూడా పార్టీలో ఇంకా మాధవ్ విషయంపై ఎలాంటి చర్చా జరగడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి తనకు టికెట్ ఇవ్వాలని ఆయన ప్రొపోజల్ పంపించి 4 నెలలు అయిందని అంటున్నారు.కానీ, ఇది ఇంకా అమలుకు కూడా నోచుకోలేదని.. జిల్లాలోని కొందరు నాయకులు తనపై కుట్రలు చేస్తున్నారని.. ఇటీవల మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ పరంగా చూస్తే.. మాధవ్ వ్యవహారాన్ని జగన్ లైట్ తీసుకుంటున్నారు. గతంలో 2019లో తొలిసారి పోటీ చేసిన ఆయన హిందూపురం నుంచి ఎంపీగా విజయం దక్కించుకున్నారు. కానీ, న్యూ*డ్ వీడియో కాల్స్ ద్వారా.. ఆయన వివాదం అయ్యారు. ఫలితంగా టికెట్ కోల్పోయారు. ఇదే అభిప్రాయం ఇంకా జగన్‌లో ఉందని అంటున్నారు. అయితే.. అది తప్పుడు వీడియో అని ఇంకా గోరంట్ల సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
దీనికి తోడు పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్నానని చెబుతున్నారు. కానీ.. యాక్టివ్ అంటే.. ఇలా కాదని.. ప్రజల మధ్య ఉండాలని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. మొత్తానికి ``పార్టీ కనుక తనకు టికెట్ ఇవ్వకపోతే.. అప్పుడు అసలు మాధవ్‌ను చూస్తారంటూ.. `` ఆయన చేసారు అని ప్రచారం జరుగుతున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరి రెబల్‌గా మారతారో.. లేక సర్దుకు పోతారో చూడాలి.