ఒడిషాలో ఏపీ పంచాయతీ: రేపటి ఎన్నికలపై ఆదేశాలివ్వలేమన్న సుప్రీం

Update: 2021-02-12 17:30 GMT
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోంది. అయితే ఏపీకి సరిహద్దున ఒడిషా బార్డర్ లోని కొన్ని గ్రామాల్లోనూ ఎన్నికల నగారా మోగించింది. అక్కడ కూడా యథావిధిగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.అయితే తమ రాష్ట్రంలోని 3 గ్రామ పంచాయతీలకు ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందని ఒడిషా ప్రబుత్వం సుప్రీంకోర్టుకు ఎక్కింది. అవి తమ గ్రామాలేనని..అక్కడ నిర్వహించవద్దని కోరింది.తాజాగా ఈ పిటీషన్ పై విచారణ జరిగింది. పిటీషన్ పై వచ్చే వారం సమాధానం చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఒడిషా బార్డర్ లోని ఆ మూడు పంచాయతీల్లో రేపు జరిగే ఎన్నికలపై ఎలాంటి ఆదేశాలను సుప్రీం ఇవ్వలేదు.అంటే అక్కడ ఎన్నికలను ఆపలేదు. ఏపీ ప్రభుత్వం నిర్వహించవచ్చని తెలిపింది.తదుపరి విచారణ శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కాగా 3 పంచాయతీల పేర్లు మార్చి ఏపీ సర్కార్ ఎన్నికలు నిర్వహిస్తోందని ఒడిషా వాదిస్తోంది.
Tags:    

Similar News