ఏపీలో మహమ్మారి కల్లోలం: ఒక్కరోజే 1,263 పాజిటివ్

Update: 2020-07-06 12:10 GMT
వైరస్ నిర్ధారణ పరీక్షలు పెంచుతుండగా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా సోమవారం ఒక్కరోజే 1,263 పాజిటివ్ కేసులు నిర్ధారించారు. 28,239 పరీక్షలు నిర్వహించగా 1,672 పరీక్షలు చేయగా ఒ స్థాయిలో కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం ఏపీలో తొలిసారి. వీటితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 20,019కి చేరింది.

తాజాగా వైరస్ తో బాధపడుతూ ఏడు మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 239కి చేరింది. వైరస్ బారినపడి చికిత్స పొంది కోలుకున్న 424 మంది డిశ్చార్జయ్యారు.

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో టెస్టులు 10,33,852 చేశారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 10,860 ఉన్నాయి. వారంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసులు ఉండగా అనంతపురము జిల్లా రెండో స్థానంలో ఉంది.
Tags:    

Similar News