జగన్ సర్కార్ పై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Update: 2020-11-21 05:00 GMT
జగన్ సర్కార్ పై మరోసారి ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రూ.వేల కోట్లు ఖర్చు చేసి ప్రస్తుతం అమరావతి నుంచి రాజధాని తరలిస్తామనడం ప్రభుత్వ మతిలేని చర్య కాదా అని హైకోర్టు ఘాటుగా ప్రశ్నించింది. ప్రభుత్వం ఖర్చు చేసిన ఆ సొమ్మంతా ప్రజలదని.. పనులు నిలిపివేయడంతో అంతిమంగా నష్టపోయేది ప్రజలేనని వ్యాఖ్యానించింది.

అమరావతి రాజధానికి వ్యతిరేకంగా విశాఖకు వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ తెనాలి మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పోలీసుల తరుఫున సీనియర్ కౌన్సెల్ వాదించారు. ప్రభుత్వ మతిలేని చర్య అంటూ చంద్రబాబు అవగాహన కల్పించడం కోసం యాత్ర చేపట్టారని పిటీషన్ లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మతిలేని చర్య అనడంపై అభ్యంతరం తెలిపింది.

రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పిటీషనర్ తన అఫిడవిట్ లో ‘ప్రస్తుత ప్రభుత్వం మతిలేని చర్య’ అని పేర్కొంటే తప్పు ఏమిటీ అని ప్రభుత్వ సీనియర్ కౌన్సిల్ ను హైకోర్టు ప్రశ్నించింది. రాజధాని ప్రాంతంలో చాలా భవనాలు నిర్మించి వాటిని వదిలేశారని.. ఖర్చు చేసిందంతా ప్రభుత్వానికి ప్రజలకు జరిగిన నష్టం కాదా అని ప్రశ్నించింది.

దీనిపై స్పందించిన సీనియర్ కౌన్సిల్.. అమరావతికి పోతే ఏడారిని తలపిస్తోందని.. అక్కడ నీళ్లు లేవు.. టీ దొరకదు..కనీసం న్యాయవాదులకు మధ్యాహ్నం భోజనం కూడా చేయడానికి సౌకర్యం లేదని విన్నవించారు. రాజధాని అమరావతిలో ఉంటే 100 కోట్ల నష్టం అని.. విశాఖకు తరలిస్తే రూ.10కోట్లు మాత్రమే నష్టం అని వివరించారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ దాఖలు చేసిన ప్రస్తుత పిల్ కు విచారణార్హత లేదన్నారు.

వాదనలు విన్నాక చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. రూల్స్ పాటించని అసిస్టెంట్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని పేర్కొంది.
Tags:    

Similar News