జగన్ బ్యాక్ గ్రౌండ్ లో మార్పును గమనించారా?
ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసులో సరికొత్త మార్పు చోటు చేసుకుంది. ఆడంబరాలకు దూరంగా.. సింఫుల్ గా ఉండటానికి పెద్ద పీట వేసేలా వ్యవహరించే సీఎం జగన్మోహన్ రెడ్డి అభిరుచికి తగ్గట్లే తాజా మార్పు చోటు చేసుకుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ వెనుక ఉండే బ్యాక్ గ్రౌండ్ లో భారీ ఎత్తున పూర్ణ వికసిత పద్మం భారీగా ఉండేది. బంగారు వర్ణంలో ఉండే ఈ బ్యాక్ గ్రౌండ్ రిచ్ గా ఉండటం తెలిసిందే.
తాజాగా ఈ బ్యాక్ గ్రౌండ్ పూర్తిగా మారిపోయింది. పూర్ణవికసిత పద్మం స్థానే.. ఏపీ సర్కారు లోగోను ఉంచటం గమనార్హం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత.. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతిలోని సీఎం క్యాంప్ ఆఫీసులోని రివ్యూ హాల్లో సీఎం కూర్చునే కుర్చీ వెనుక ఉన్న గోడకు పెద్ద చక్రం ఆకారంలో ఉండే పద్మం ఉండేది.
ఒకప్పుడు ఆ ప్రాంతంలో బౌద్ధం విరాజిల్లిందనటానికి నిదర్శనంగా దాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతారు. బాబు అభిరుచికి తగ్గట్లు భారీగా ఉండే పద్మాన్ని ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. అయితే.. ఇంత ఆడంబరంగా ఉండాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసే డిజైన్ గోడకు ఉండాలన్న ఉద్దేశం తో సదరు పూర్ణ వికసిత పద్మాన్ని తీసేసి.. దాని స్థానంలో ఏపీ ప్రభుత్వ లోగోను ఏర్పాటు చేయటం ఆసక్తికర చర్చగా మారింది.