నిమ్మగడ్డ అనుకున్నదే చేసిన ఏపీ సర్కారు.. ఇద్దరు అధికారుల బదిలీ.. త్వరలో మరో 9 మంది?
రాజ్యాంగం అనే రూల్ బుక్ ఉండటం.. దాన్ని తూచా తప్పకుండా అమలు చేసేందుకు న్యాయవ్యవస్థ ఒకటి ఉన్న వేళ.. ఎంత ప్రజాబలం ఉన్నా.. తాము అనుకున్నది అనుకున్నట్లుగా సాధ్యం కాదన్న విషయాన్ని తాజాగా మరోసారి నిరూపితమైంది. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేయించుకోగలుగుతున్నారు. తనకున్న విశేష అధికారాల్ని ఆయన అమలు చేస్తున్నారు. నిమ్మగడ్డ ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారన్న ఆరోపణలు.. విమర్శలు ఉండటం తెలిసిందే.
దీనికి భిన్నంగా తాజాగా నిమ్మగడ్డ ఆదేశాల్ని అమలు చేసింది ఏపీలోని జగన్ సర్కార్. ఏపీ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ సూచన మేరకు పంచాయితీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్‌లను బదిలీ చేయాలని కోరగా.. అందుకు ప్రభుత్వం అంగీకరించి.. వారిని బదిలీ చేసింది.
ఇదే విషయంపై రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాస్త నిష్ఠూరం ఆడారు కూడా. రాస్ట్ర పంచాయితీ రాజ్ ముఖ్యకార్యదర్శి..ఆ శాఖ కమిషనర్ ఇప్పటికే బదిలీ అయ్యారు.. ఆయన (నిమ్మగడ్డ) ఇంకా ఎంతమందిని బదిలీ చేసుకున్నా మేం పట్టించుకోమన్నారు. తాజాగా బదిలీ అయిన ఇద్దరికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇంకా జారీ కాలేదంటున్నారు.
ఇదిలా ఉంటే.. గతంలో కొందరు అధికారుల్ని బదిలీ చేయాలని నిమ్మగడ్డ కోరటం తెలిసిందే. వారంతా తొమ్మిది మంది వరకు ఉంటారని.. వారందరిపై వేటు పడనున్నట్లుగా చెబుతున్నారు. వీరిలో ఎక్కువగా పోలీసు అధికారులే ఉండటం గమనార్హం. గతంలో నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదు. తాజాగా సుప్రీం ఆదేశాల నేపథ్యంలో.. గతంలో తాను బదిలీ చేయాలని కోరిన ఉన్నతాధికారులందరి పైనా ట్రాన్సఫర్ వేటు పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇదంతా చూస్తున్నప్పుడు నిమ్మగడ్డ తనపంతాన్ని నెగ్గించుకుంటున్నారన్న మాట వినిపిస్తోంది.