ఏపీ ఎన్నికల ఫలితాలు లేట్‌ ఎందుకు అవుతాయి.?

Update: 2019-04-27 12:50 GMT
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపైనే ఉంది. అనూహ్యంగా ఎప్పుడూ లేనంతగా ఈసారి ఫలితాల కోసం దాదాపు 43 రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో.. అటు టీడీపీ, ఇటు వైసీపీల్లో అసహనం పెరిగిపోతుంది. గెలిచేది మేమే అంటూ పైకి చెప్పుకుంటున్నా కానీ ఇరు పార్టీలో భయం ఉందనేది మాత్రం కాదనలేని వాస్తవం. ఇలాంటి సమయంలో.. ఏపీ ఎన్నికల కమిషనర్‌ గోపాల కృష్ణ ద్వివేది చేసిన సంచలన వ్యాఖ్యలు మరింత కాక పుట్టించాయి. ఏపీలో ఎన్నికల ఫలితాలు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

కౌంటింగ్‌ పూర్తైన తర్వాత వీవీ ప్యాట్ల స్లిప్పులు కూడా లెక్కించాల్సిందేనని సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వీవీఫ్యాట్ల లెక్కింపు తర్వాతే తుది ఫలితాలు వెల్లడించాల్సి ఉండడంతో… అదనంగా 6, 7 గంటల సమయం పట్టే అవకాశం ఉందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో పూర్తి ఫలితాలు వెల్లడవ్వడానికి అర్థరాత్రి 12 గంటలు దాటే అవకాశాలున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తే మధ్యాహ్నం 2 గంటలకు చాలా చోట్ల కౌంటింగ్ పూర్తయ్యేది. సాయంత్రం 5 గంటలకే తుది ఫలితాలు వచ్చేవి. ఈసారి మాత్రం వీవీఫ్యాట్ల లెక్కింపుతో ఫలితాలను అధికారికంగా వెల్లడించడానికి ఆలస్యం కానుంది.
Read more!

అసలు ఎన్నికల తర్వాత కౌంటింగ్‌ కు ఇంత లేటా అని నాయకులు తెగ టెన్షన్‌ పడిపోతున్నారు. ఈ టెన్షన్‌ తట్టుకోలేక జగన్‌ ఏమో స్విజ్జర్లాండ్‌ వెళ్తే.. చంద్రబాబు కుటుంబ సమేతంగా హిమాచల్‌ ప్రదేశ్‌ వెళ్లారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఛలో బ్యాంకాక్‌ అన్నాడు. ఈ టైమ్‌ లో గోపాల కృష్ణ ద్వివేది కామెంట్ల్‌ పార్టీల్లో కాస్త కలకలం సృష్టించాయి. కౌంటిక్‌ కు ఇంకా టైమ్‌ ఉన్న సమయంలో.. ద్వివేది ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందా అని మరికొందరు గుసగుసలాడుకుంటున్నారు.

    
    
    

Tags:    

Similar News