2 రోజులు 2 వికెట్లు.. జగన్ ఇచ్చిన సందేశం ఏమిటి?
అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేసేయొచ్చు అన్న మాట గతంలో చెబితే పెద్దగా నమ్మే వారు కాదు. అదెలా కుదురుతుంది? నిబంధనలు ఉండవా? ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా సాహసాలు చేస్తారా? లాంటి వాదనలన్ని 2014కు ముందు వరకు ఉండేవి.
ఎప్పుడైతే ఏపీ రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పంతం పట్టినట్లుగా వ్యవహరించి.. మెజార్టీ నిర్ణయాన్ని పక్కన పెట్టేసి.. తాను కోరుకున్న రీతిలో రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసేయటం.. అందుకోసం పార్లమెంటు తలుపులు మూసేసి.. టీవీల్లో లైవ్ టెలికాస్ట్ నిలిపివేసి.. గందరగోళ పరిస్థితుల మధ్య.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా విభజన కార్యక్రమాన్ని పూర్తి చేయటం మర్చిపోకూడదు.
సోనియమ్మకు ఎందుకింత పంతం? విభజన విషయంలో ఆమె మిగిలిన విషయాల్ని ఎందుకు పట్టించుకోలేదు? సంప్రదాయాల్ని ఎందుకు వదిలేశారు? మెజార్టీ నిర్ణయానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు? అన్న ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం ‘అధికారం’ అని మాత్రం చెప్పక తప్పదు.
ఏపీ విభజన తర్వాత తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామని.. కేంద్రంలోనూ పవర్లోకి రావటానికి ఉపకరిస్తుందన్న తప్పుడు అంచనాలు ఆమెను మరింత మొండిగా.. మూర్ఖంగా వ్యవహరించేలా చేశాయి. ఫలితంగా ఏం జరిగింది? ఒకప్పుడు అత్యంత శక్తివంతంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఉనికి కోసం కిందా మీదా పడుతున్న పరిస్థితి.
అప్పటి నుంచి దేశంలో కావొచ్చు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒక కొత్త ధోరణి మొదలైంది. చేతిలో అధికారం ఉంటే చాలు.. తాము అనుకున్నది అనుకున్నట్లుగా చేయటం మొదలైంది. ఒకరు ఎక్కువ కాదు.. మరొకరు తక్కువ అని కాదు. ఎక్కువ తక్కువ అన్నది ఆయా ముఖ్యమంత్రుల మైండ్ సెట్ మీద ఆధారపడి ఉండేది.
విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలను పాలించిన.. పాలిస్తున్న సీఎంను చూస్తే.. ఎవరికి వారు తమకు తోచినట్లుగా వ్యవహరించారని చెప్పాలి. దీన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లటంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లారని చెప్పక తప్పదు. మరి.. చంద్రబాబు సుద్దపూస అని ప్రశ్నించొచ్చు. ఆయన సుద్దపూస అని చెప్పట్లేదు. కాకుంటే.. ఈ ఇద్దరితో పోలిస్తే.. చాలా మేర బెటర్ అని చెప్పొచ్చు.
ప్రభుత్వ ఉద్యోగులకు తమకు వచ్చే జీతాల కంటే తక్కువ జీతాలు వచ్చేలా చేయగలిగిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డే అవుతారు. సమ్మె చేసిన ఆర్టీసీ ఉద్యోగులు.. చివరకు అయ్యా.. బాబు.. మమ్మల్ని కరుణించాలంటూ వేడుకున్నంత పని చేసే పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ దే.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తమకు నచ్చిన వారిని నెత్తిన పెట్టుకోవటం.. నచ్చని వారి విషయంలో పాతాళానికి తొక్కేయటం లాంటి విషయాల్లో కేసీఆర్.. జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరూ ఇద్దరేనని చెప్పక తప్పదు.
గడిచిన రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు అత్యున్నత అధికారులు.. ఒకరు సీనియర్ ఐఏఎస్ అధికారి అయితే.. మరొకరు సీనియర్ ఐపీఎస్ అధికారి. వారిద్దరే ప్రవీణ్ ప్రకాష్.. గౌతమ్ సవాంగ్. ఈ ఇద్దరు అధికారులు ప్రభుత్వానికి గుండెకాయ.. మెదడుగా వ్యవహరించేవారు. ఆ ఇద్దరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయులుగా ఉండటటం తెలిసిందే.
విధి నిర్వహణలో రూల్ బుక్ కు మించి మరేమీ ఉండదన్న విషయాన్ని వదిలేసి.. ముఖ్యమంత్రి మనసుకు నచ్చినట్లుగా వ్యవహరించటం ద్వారా.. అధికారాన్ని అరచేతిలో పెట్టుకోవచ్చన్నట్లుగా వ్యవహరించి విమర్శల్ని మూటకట్టుకున్నారు. విధి నిర్వహణ వేళ.. తమ వ్యవహార శైలితో శాఖా పరంగా ఎప్పటికి చెరిగిపోని మరకల్ని వేయించుకున్నారు. చివరకు వారిద్దరు రోజు తేడాతో అడ్రస్ లేకుండా పదవుల్ని విడిచి పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి.
ఇదంతా చూసినప్పుడు అనిపించేది ఒక్కటే. విధేయత కంటే కూడా కమిట్ మెంట్ కు మించింది లేదు. విధేయతగా ఉండే అధికారం చేతిలో ఉన్న వారికి అణిగిమణిగి ఉండాల్సి ఉంటుంది. అలా ఉన్నప్పటికి వారి మనసుకు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పాయింట్ లో ఇబ్బంది కలగటం.. ఆ వెంటనే ఎక్కడకు పంపుతారో కూడా తెలీని రీతిలో బదిలీ వేటు పడుతుంది.
తాజాగా గౌతమ్ సవాంగ్ విషయాన్నే తీసుకుంటే.. రాష్ట్ర పోలీస్ బాస్ గా వ్యవహరించిన ఆయన్ను.. పదవీ కాలం మరో ఏడాది వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్టు చేయాలని పేర్కొనటం చూస్తే.. ఇంతకు మించిన అవమానం ఇంకేం ఉంటుంది?
గౌతమ్ సవాంగ్ తో పోలిస్తే.. ప్రవీణ్ ప్రకాశ్ ను ఢిల్లీలోని ఆయన పాత పోస్టుకే బదిలీ చేశారు. గౌతమ్ తో పోలిస్తే ప్రవీణ్ పరిస్థితే కొంతలో కొంత నయమని చెప్పక తప్పదు. ఏమైనా.. రూల్ బుక్ కాదనుకొని.. అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా.. వారికి విధేయుడిగా వ్యవహరించటం బాగానే ఉన్నా.. అదంతా తాత్కాలికమేనన్న విషయం తాజా పరిణామం స్పష్టం చేసిందని చెప్పాలి.
ఒకవేళ.. రూల్ బుక్ పరిధి దాటి వ్యవహరించేదే లేదని కమిట్ మెంట్ తో ఉండి ఉంటే.. మరో ఏడాదిన్నర ముందే బదిలీ వేటు పడేదేమో? కానీ..ప్రజల గుండెల్లో ముక్కుసూటి అధికారిగా మిగిలేవారు. ఈ చిన్న లాజిక్ ను ఇప్పటికైనా మిగిలిన వారు గుర్తిస్తారో? లేదో?