• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తృటిలో తప్పించుకున్న ఏపీ...

తృటిలో తప్పించుకున్న ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్..అప్రమత్తమే!

By - Tupaki Desk
Update: 2020-05-31 06:03 GMT
మీడియాలోనూ.. సామాజిక మాథ్యమాల్లోనూ పెద్దగా ఫోకస్ కాలేదు కానీ.. మాయదారి రోగానికి సంబంధించి ఏపీలో తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు బోలెడన్ని. వివిధ రాష్ట్రాల నుంచే కాదు.. ఏపీలోని ఒక  ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లిన వారికి సంబంధించిన వివరాల్ని పక్కాగా నిర్వహించటంతో పాటు.. అలా ప్రయాణించిన వారి మీద డేగకన్ను వేయటం.. విమాన సర్వీసులు షురూ అయ్యాక ప్రయాణికుల విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు పక్కాగా ఉన్నాయి. మాయదారి రోగం విస్తరించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన కేర్ మీద ఏపీని వంక పెట్టాల్సిన అవసరమే లేదు.

కానీ.. ఇవేమీ పెద్దగా హైలెట్ కాలేదు. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో మాయదారి రోగం అంటకుండా ఉండేందుకు అనుసరిస్తున్న అప్రమత్తత.. విధివిధానాలు చాలా బాగున్నట్లుగా ఉద్యోగ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇప్పుడు ఈ అప్రమత్తతే ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసును కాపాడిందని చెప్పాలి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్దారణ పరీక్షలు నిర్వహించటంతో పాటు.. ఎక్కడా రాజీ పడటం లేదు. తాజాగా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నాలుగో నెంబరు గేటు వద్ద విధి నిర్వహణ కోసం కర్నూలు నుంచి ఏపీఎస్సీ కానిస్టేబుల్ వచ్చారు.

అలా వచ్చిన వారికి క్షుణ్ణంగా పరీక్షలు జరిపిన తర్వాతే విధి నిర్వహణకు అనుమతిస్తారు. అలా నాలుగు రోజుల క్రితం నిర్వహించిన నిర్దారణ పరీక్షల ఫలితాలు తాజాగా బయటకు వచ్చాయి. సదరు కానిస్టేబుల్ కు పాజిటివ్ గా తేలింది. దీంతో.. అతడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతనితో ఉన్న పోలీసుల్ని ఖాళీ చేయించారు. అప్రమత్తతే ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కాపాడిందన్న మాట వినిపిస్తోంది. ఒకవేళ.. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించాల్సి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    
  • AP Cm Camp Office 
  • Constable 
  • Coronavirus 

Similar News

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

నీతా అంబానీ గొప్ప మనసు.. 5 వేల మంది నిరాశ్రయులకు అండగా ‘అనంత్ ఆశ్రయ్’

2026-11-02 04:56 GMT

28 ఏళ్లుగా ప్రపంచ పాదయాత్ర.. 50 వేల కిలోమీటర్లు నడిచిన బ్రిటిష్ సాహసికుడు!

2026-11-02 03:59 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

బాబు ఒక్క ఫోన్ కాల్ తో విజయ్ డీకే ఓకే

2026-11-02 03:53 GMT

ప్రతిపక్షమంతా ఒక్కటిగా...మోడీ షా టార్గెట్ గా !

2026-11-02 03:50 GMT

జగన్ రెడీ అయినట్లేనా ?

2026-11-02 03:48 GMT

సింగిల్స్‌కు ఉచితంగా ఫిన్‌ల్యాండ్ ప‌ర్యట‌న‌కు ఛాన్స్

2026-11-02 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS