ఆంధ్రజ్యోతి ఎండీ చెప్పిన జగన్ ఫ్యూచర్ బీజేపీ అధినాయకత్వానికి తెలుస్తోందా?

Update: 2020-08-17 04:00 GMT
భవిష్యత్తును ఊహించటం అంత తేలికైన విషయం కాదు. ఎలా పడితే అలా ఊహించేసి.. చెప్పేస్తే వచ్చే చిక్కులు అన్ని ఇన్ని కావు. అందునా.. బుర్రలో పుట్టిన ఆలోచనల్ని తన మీడియా ద్వారా చెప్పేసి.. కొత్త గందరగోళానికి గురయ్యేలాంటి రాతలు తెచ్చే చిరాకు ఎక్కువగా ఉంటుంది. తాజాగా అలాంటి పనే చేశారు ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే. ఏపీలోని జగన్ సర్కారు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందనే విశ్లేషణను చేసే క్రమంలో ఆయన తీరు ఏ మాత్రం బాగో లేదంటున్నారు. ఏం జరుగుతుందన్న విషయం పై ఆయన చెప్పిన జోస్యం టాలీవుడ్ సినిమాను తలపించినట్లుగా చెప్పక తప్పదు.

జగన్ మీద ఉన్న ఆదాయానికి మించిన కేసుల బూచితో జగన్ కు చుక్కలు చూపించేందుకు వీలుగా బీజేపీ అధినాయకత్వం సిద్ధమవుతుందని.. ఏపీలో జగన్ సర్కారు కూలిపోయే అవకాశం ఉందన్న ఆయన అంచనా సంచలనంగా మారింది. ఇందుకు తగినట్లుగా ఆయనో విశ్లేషణను వినిపిస్తున్నారు. ఇది ఏపీ అధికారపక్షానికే కాదు.. బీజేపీ నేతలకు ఏ మాత్రం మింగుడుపడనట్లుగా ఉందంటున్నారు. ఇలా తనకు తోచినట్లు గా రాసేయటం ద్వారా బీజేపీ ఇమేజ్ ను కూడా డ్యామేజ్ చేస్తుందన్న మాట వినిపిస్తోంది.

జగన్ భవిష్యత్తు మొత్తం బీజేపీ అధినాయకత్వం చేతిలో ఉందని.. ఏ రోజు అయినా జగన్ మీద పెట్టిన కేసులే ఆయన్ను ఇబ్బంది పెడతాయని.. అదే జరిగితే.. సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. అదే జరిగితే.. ఏపీలో సీఎంగా జగన్ సతీమణి భారతి కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన వినిపిస్తున్న జోస్యం ఇప్ప్ుడు సంచలనంగా మారుతోంది. అంతేకాదు.. జగన్ పార్టీని తమ పార్టీలోకి విలీనం చేయాలని బీజేపీ ఒత్తిడి చేసిందని.. దానికి జగన్ ససేమిరా అన్నట్లు పేర్కొన్నారు. ఇలా తన వ్యాఖ్యలతో అటు జగన్ ప్రభుత్వానికి.. ఇటు బీజేపీకి డ్యామేజ్ చేసేలా ఉన్నాయని చెబుతున్నారు. ఏమైనా.. ఆర్కే చెప్పిన జోస్యం భవిష్యత్తులో ఏమవుతుందో కానీ.. ఇప్పటికైతే జగన్ కు మాత్రమే కాదు.. ఆయన్ను అభిమానించే వారందరికి మండిపోయేలా ఉందని చెప్పక తప్పదు. తన విశ్లేషణతో తమ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నాడన్న దానిపై బీజేపీ అధినాయకత్వానికి తెలుస్తుందా? అన్నదిప్పుడు క్వశ్చన్ గా మారింది. వారి స్పందన ఏమిటన్నది కూడా ఆసక్తికరం.
Tags:    

Similar News