నేటి నుంచి ఏపీ అసెంబ్లీ.. కీలక బిల్లులు ఇవే
ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. శాసనసభ 9 గంటలకు, మండలి 10 గంటలకు సమావేశం కానుంది. అసెంబ్లీని 5 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ సమావేశాల్లోనే 17 బిల్లులను ఆమోదింప చేసుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
తాజా అసెంబ్లీ సమావేశాల్లో పోలవరం ఎత్తుపై సభ దద్దరిల్లే అవకాశాలున్నాయి. పోలవరం ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించాలని చూస్తున్నారని.. తద్వారా భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు టీడీపీ ఆరోపిస్తోంది. దీన్ని వైసీపీ ఖండించింది. ఎత్తు తగ్గించమని స్పష్టం చేసింది. దీనిపై సభలో చర్చకు పెట్టే అవకాశం కనిపిస్తోంది.
తొలిరోజు అసెంబ్లీలో ఇటీవలే చనిపోయిన వారిని సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గాయకుడు బాలు,ఏపీకి చెందిన నేతల మృతికి సభ సంతాపం తెలుపనుంది.
ప్రధానంగా పంచాయితీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఆర్డినెన్స్ ను ఆమోదించుకోవాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. మండలి తిరస్కరించిన బిల్లును మళ్లీ ప్రవేశపెడుతున్నారు.
వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్-విద్యుత్ రంగంలో సంస్కరణలు..., పోలవరం ప్రాజెక్టు-గత ప్రభుత్వ తప్పిదాలు.. ఇళ్ల స్థలాల పంపిణీ-ప్రతిపక్షాల కుట్ర.. టిడ్కో గృహాలు-వాస్తవాలు.. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ-ప్రతిపక్షాల కుట్ర.. పారిశ్రామికాభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది.