• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సచివాలయ ఉద్యోగులకు ఏదీ...

సచివాలయ ఉద్యోగులకు ఏదీ శుభవార్త!

By - Tupaki Desk
Update: 2022-06-11 05:29 GMT
ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు వైఎస్ జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పలేదు. రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని డిపార్టమెంటల్ టెస్టుల్లో ఉత్తీర్ణులైనవారికి జూన్ 10న ప్రొబేషన్ ఖరారు చేస్తానని ఇంతకుముందు ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జూన్ 10న ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించింది. ప్రొబేషన్ ఖరారు అయినవారికి జూలై 1 నుంచి నూతన పేస్కేల్ ప్రకారం వేతనాలు అందిస్తామంది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న1.17 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. అయితే జూన్ 10న ప్రభుత్వం ప్రొబేషన్ ను ఖరారు చేస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ, అసంతృప్తి నెలకొందని అంటున్నారు.

కాగా మొత్తం 1.17 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో వివిధ నిబంధనలను చూపి ప్రభుత్వం 56 వేల మందికి మాత్రమే ప్రొబేషన్ ఖరారు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. పలు కారణాలు చూపి 60 వేల మంది ఉద్యోగులను పక్కన పెట్టినట్టు సమాచారం. దీంతో వీరంతా తమ ఉద్యోగాలపై ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. తాము ప్రభుత్వ నియామక పరీక్ష రాసి ఉద్యోగం సాధించినా.. ప్రొబేషన్ పేరుతో రూ.15 వేల తక్కువ జీతానికే తమతో పనిచేయించుకున్నారని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

గతంలో పీఆర్సీ, వేతనాల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లు నిరసనకు దిగినప్పుడు వారితోపాటు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు కూడా ఆందోళన చేశారు. అయితే ప్రభుత్వం అప్పుడు వీరికి కూడా భరోసా ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదని వారికి జూన్ లో ప్రొబేషన్ ఖరారు చేస్తామని చెప్పింది. అయితే డిపార్టమెంట్ టెస్టులో పాసయితేనే ప్రొబేషన్ అని మెలికపెట్టింది. ఆ డిపార్టుమెంట్ టెస్టు కూడా కొద్దిమందికే నిర్వహించిందనే విమర్శలు ఉన్నాయి. అలాగే వాటి ఫలితాలను ఇవ్వలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమందికి అయితే అసలు ఇప్పటివరకు డిపార్టుమెంట్ టెస్టు కూడా నిర్వహించలేదని చెబుతున్నారు. 14 వేల మంది మహిళా పోలీసులకు ఏడాది క్రితం డిపార్టుమెంట్ టెస్టు నిర్వహించినా ఇంతవరకు ఫలితాలు ఇవ్వలేదు. దీంతో వారందరికీ ప్రొబేషన్ ఖరారు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

కాగా 15 రోజుల కంటే ఎక్కువ క్యాజువల్ లీవులు వాడుకున్న కార్యదర్శులకు, షోకాజు నోటీసులు అందుకున్నవారికి, మెటర్నటీ లీవులో ఉన్న సిబ్బందికి, అనారోగ్యంతో సెలవులో ఉన్నవారికి ప్రొబేషన్ ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అలాగే కొంతమంది సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం పెట్టిన టార్గెట్లు పూర్తి చేయలేదని వారికి కూడా ప్రొబేషన్ ఇవ్వడం లేదని అంటున్నారు.

మరోవైపు ఈ విషయం మీద తాజాగా గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి కూడా స్పందించారు. 14 వేల మంది మహిళా పోలీసుల డిపార్టుమెంట్ టెస్టుల ఫలితాలు త్వరలో విడుదలవుతాయన్నారు. డిపార్టుమెంటల్ టెస్టులు నిర్వహించనివారికి ఈ నెలాఖరులోగా నిర్వహిస్తారని తెలిపారు. ప్రొబేషన్ ప్రకటించిన వెంటనే ఆయా పోస్టుల కేటగిరీ ప్రకారం విధులు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇస్తుందన్నారు. ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ద్వారా సంబంధిత లైన్ డిపార్టుమెంట్లతో గ్రామ సచివాలయ ప్రొబేషన్ ప్రకటిస్తుందని వివరించారు.

అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. ఎల్లో మీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడుతోంది. జూన్ నెలాఖరుకల్లా ప్రొబేషన్ ఖరారు చేసి జూలై నుంచి పెరిగిన వేతనాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెబుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జనవరిలోనే ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారని పేర్కొంటున్నారు. డిపార్టుమెంటల్ పరీక్షలు పాసయిన 80 వేల మంది ఉద్యోగుల వివరాలను అధికారులు తెప్పించుకుంటున్నారని వివరిస్తున్నారు. త్వరలోనే మరో 14 వేల మహిళా పోలీసుల డిపార్టుమెంటల్ టెస్టు ఫలితాలను వెల్లడిస్తామని చెబుతున్నారు.
Tags:    
  • AndhraPradesh 
  • YSJagan 
  • Government 
  • President 
  • KVenkatramireddy 
  • SecretariatEmployees 
  • PoliticalNews 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS