యాంటీ ప్రచారం.. ఓట్లు.. ఓటమి.. వైసీపీలో హాట్ టాపిక్ ఇదే..!
యాంటీ ప్రచారం.. ఏపీ అధికార పార్టీ వైసీపీని కుదిపేస్తున్న ప్రధాన సమస్య. ఈ యాంటీ ప్రచారంలోనూ అనేక మలుపులు కనిపిస్తున్నాయి. ఒకటి నేరుగా వైసీపీని వ్యతిరేకిస్తే.. మరొకటి.. వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టుగానే ఉంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించే వ్యతిరేక ప్రచారం.
భారీ ఎత్తున సోషల్ మీడియాలో ఈ వ్యతిరేక ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకప్పుడు.. కేవలం.. రాష్ట్ర ప్రభుత్వంపైన, సీఎం జగన్‌పైన మాత్రమే.. వ్యతిరేక ప్రచారం చేసేవారు. కానీ.. ఇప్పుడు ఈ వ్యతిరేక ప్రచారం.. మండలాల స్థాయికి కూడా చేరిపోయింది.
దీనికి.. ఈ వ్యతిరేక, అనుకూల వ్యతిరేక ప్రచారానికి కర్త కర్మ క్రియ ఎవరనే విషయం తెలిసినా.. దీనికన్నా.. ముందు.. వైసీపీ నేతల్లో క్షేత్రస్థాయిలో ఒకవిధమైన గుబులు పుట్టించి.. వారిని ప్రజలకు దూరం చేయాలనే ఒక కుట్ర దాగి ఉందని.. వైసీపీలో చర్చ సాగుతోంది.
నిజానికి ప్రభుత్వంపైనా.. సీఎంపైనా.. వ్యతిరేక ప్రచారం జరిగినా.. ఇది గిట్టని వారు చేస్తున్నారు. లేదా.. అధికారంలోకి వచ్చేందుకు చేస్తున్నారనే వ్యాఖ్యలు మేధావుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ యాంటీ ప్రచారానికి ఫలితం దక్కడం లేదు.
ఈ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని పీక్ స్టేజ్‌కు తీసుకువెళ్లడంతోపాటు.. గ్రామ స్థాయిలో చర్చకు వచ్చేలా వ్యూహాత్మకంగా అడుగులు పడుతున్నాయి., ఈ ప్రచారంపై గ్రామ, మండలస్థాయిలో చర్చ జరుగుతున్న మాట వాస్తవమే.
స్థానిక వైసీపీ మంత్రులు. ఎమ్మెల్యేలపై.. భారీ ఎత్తున వీడియోలు.. ఆడియోలు.. ఫొటోలు .. కామెంట్లు.. ఇలా.. అనేక రూపాల్లో వ్యతిరేక ప్రచారం.. జోరుగా సాగుతోంది. ఇది సహజంగానే వైసీపీ నేతలకు కంట్లో నలుసుగా మారింది. దీంతో ఈ ప్రచారం ఓట్లపై ప్రభావం చూపుతుందా? వచ్చే ఎన్నికల్లో తాము ఓడిపోతామా? అని.. నాయకులు చర్చించుకోవడం గమనార్హం.
అయితే.. దీనికి కొందరు సీనియర్లు విరుగుడు మంత్రం చెబుతున్నారు. తమకు బలం లేని నాయకులే.. ఎదుటి వారిలో లోపాలు వెతుకుతారని.. దీనికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. ఇలాంటి ప్రచారాలకు ప్రజలు లొంగిపోతే.. గత ఎన్నికల్లో మనకు అధికారం దక్కి ఉండేది కాదని.. కాబట్టి విజ్ఞులైన ప్రజలకు ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియకపోదని ధైర్యం చెబుతున్నారు. ప్రస్తుతం ఈ చర్చ.. వైసీపీలో జోరుగా సాగుతుండడం గమనార్హం.