దిశ కేసులో సంచలన మలుపు

Update: 2019-12-10 07:04 GMT
దిశ హంతకుల ఎన్ కౌంటర్ కీలక మలుపు తిరిగింది. ఎన్ కౌంటర్ లో హతమైన నలుగురు నిందితులు 20 ఏళ్ల పైబడిన వారేనని పోలీసులు తెలిపింది అవాస్తవమని వారి కుటుంబ సభ్యులు తాజాగా ఆధారాలు బయటపెట్టడం సంచలనమైంది.

దిశ హంతకుల్లోని నలుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లు అనే అంశం కొత్తగా తెరపైకి వచ్చింది. జొల్లు నవీన్, జొల్లు శివలు మైనర్లు అని వారి తల్లిదండ్రులు మానవ హక్కుల సంఘానికి ఆధారాలు సమర్పించినట్లు తెలిసింది. విచారణలో భాగంగా మృతుల తల్లిదండ్రులను హైదరాబాద్ కు పిలిపించి మానవహక్కుల సంఘం ప్రతినిధులు విచారించారు.మృతుల ఆధార్ కార్డులు, బోనఫైడ్ సర్టిఫికెట్లను పరిశీలించిన ఎన్.హెచ్.ఆర్.సీ సభ్యులు దీనిపై అవాక్కైనట్లు తెలిసింది. మైనర్లుగా తేలడంతో ఈ కేసు కొత్తమలుపు తిరిగింది.

జొల్లు శివ పాఠశాల బర్త్ డే సర్టిఫికెట్ ప్రకారం 17 ఏళ్ల వయసు మాత్రమే ఉన్నాడు. ఇక జొల్లు నవీన్ కూడా 17 ఏళ్లు అని ఆమె తల్లి ఆధారాలు చూపించింది. దీంతో మైనర్లను ఎన్ కౌంటర్ చేశారనే వార్త బయటకు రావడంతో పెద్ద దుమారం రేగుతోంది. ఈ కేసు మరింత జఠిలమవుతోంది. ఈ పరిణామం పోలీసులకు మరిన్ని చిక్కులు తేవడం ఖాయమని భావిస్తున్నారు.
Tags:    

Similar News