ఏపీలో మందుబాబులకు మరో షాక్

Update: 2019-10-06 08:03 GMT
ఇక ఆంధ్రప్రదేశ్ లో పురుసత్ గా రాత్రంతా మద్యం తాగుదామని అనుకుంటే ఆ నిర్ణయం వాయిదా వేసుకోండి. రాత్రి 8 గంటలు అయ్యిందంటే వైన్ షాపులు.. 10 గంటలకు బార్లు మూతపడుతాయి. తర్వాత మందు కోసం ఎక్కడ ఎంత వెతికినా దొరకదు.. మందుబాబులకు షాకిచ్చేలా ఇప్పుడు ఏపీ సర్కారు మరో నిర్ణయం తీసుకుంది.

మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తూ సర్కారీ వైన్స్ ను నడుపుతున్న ఏపీ సర్కారు ఇప్పుడు రాష్ట్రంలో బార్లపై కఠిన ఆంక్షలకు సిద్ధమవ్వడం మందుబాబులకు షాకింగ్ గా మారింది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రైవేటు వ్యక్తుల వద్దనున్న వైన్ షాపులను తీసుకొని సర్కారీ వైన్స్ ను ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. అందులో పలువురు యువతను రిక్రూట్ చేసుకొని నడుపుతోంది. వ్యక్తిగత నిల్వ, ఒక్కొక్కరికి ఇచ్చే మద్యం బాటిల్ల కేపాసిటీని తగ్గించింది.  ఇక  ఇక ఉదయం 11 నుంచి  రాత్రి 8 గంటల వరకే మద్యం షాపులను నడిపిస్తోంది.

ఇప్పుడు బార్లపై కూడా ఏపీ సీఎం జగన్ కన్నుపడింది. ప్రస్తుతం బార్లు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతున్నాయి. అయితే బార్ల సమయాన్ని కూడా కుదించడానికి ఎక్సైజ్ శాఖ సిద్ధమవ్వడం మందుబాబులకు ఆశనిపాతమవుతోంది.

పోలీసులకు పనిభారం తగ్గించడం.. మద్యాన్ని రాత్రిళ్లు కంట్రోల్ చేయడానికి బార్లను రాత్రి 10 గంటలకే మూసివేసేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిసింది. వీటి సాధ్యాసాధ్యాలపై తాజాగా ఓ నివేదికను రూపొందించి  సీఎం జగన్ పరిశీలనకు పంపారట..

బార్ల టైమింగ్స్ కూడా మారిస్తే ఇక ఏపీలో మందుబాబులకు పెద్ద షాక్ లా చెప్పకతప్పుదు. రాత్రి 8 గంటలకు వైన్స్, 10 గంటలకు బార్లు క్లోజ్ చేస్తే రాత్రి మద్యం తాగుదామనుకునే మందుబాబులకు మద్యం దొరకడం కష్టంగా మారుతుంది. మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న జగన్ సర్కారు తీసుకుంటున్న చర్యలతో మందుబాబులు బెంబేలెత్తిపోతున్నారు.
Tags:    

Similar News