టీడీపీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై?

Update: 2020-09-19 05:45 GMT
అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీకి షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యేను లాగేసుకుంటోంది.2019 ఎన్నికల్లో టీడీపీ భారీ ఓటమి తర్వాత చంద్రబాబు పని అయిపోయిందని చాలా మంది అధికార వైసీపీ వైపు చూస్తున్నారు. వైసీపీ కూడా అన్ని వైపుల దిగ్బంధిస్తుండడంతో టీడీపీ వరుసగా నేతలను కోల్పోతోంది. సీఎం జగన్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ లాంటివేవీ చేపట్టకుండానే టీడీపీ నుంచి వైసీపీలోకి నేతలు వలసలు వస్తున్నారు.

రోజురోజుకూ ఏపీలో టీడీపీ గ్రాఫ్‌ తగ్గుతుండడం.. చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించే శక్తిసామర్థ్యాలు ఉన్న లీడర్‌‌ లేకపోవడంతో.. ఆ పార్టీ నేతలు మనోస్థైర్యం కోల్పోతున్నారు. అందుకే.. వైసీపీ బాటపడుతున్నారు.

తాజాగా.. ఉత్తరాంధ్రలో టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్‌ తగిలింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ టీడీపీకి గుడ్‌ బై చెబుతున్నారు. ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలువనుండగా.. ఆయన సాంకేతికంగా వైసీపీలో చేరే అవకాశాలు కనిపించడం లేదు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లాగే టీడీపీకి దూరమై వైసీపీ గూటికి చేరనున్నారు.

కొంత కాలంలో పార్టీకి దూరంగా ఉంటున్న గణేష్‌ ఇప్పుడు చంద్రబాబుకు బైబై చెప్పడం అంటే.. పార్టీకి భారీ నష్టమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. విశాఖపట్టణాన్ని కార్యనిర్వహక రాజధానిగా చేయడానికి జగన్‌ తీసుకున్న నిర్ణయంతో ఈ చేరిక మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి మాదిరిగానే గణేష్‌ కూడా వైసీపీలో సాంకేతికంగా చేరారు. జగన్‌ వెంటే నడుస్తారు కానీ.. వైసీపీ కండువా మాత్రం మెడలో వేసుకోరు.
Tags:    

Similar News