మరో సంచలన నిర్ణయం తీసుకున్న జగన్

Update: 2020-01-22 10:52 GMT
గద్దెనెక్కినప్పటి నుంచి రైతు పక్షపాతిగా పేరు తెచ్చుకున్న సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు , సాగుకు లాభం కలిగేలా గొప్ప ముందడుగు వేశారు.

వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో తెలిపారు. 11154 రైతు భరోసా కేంద్రాలను గ్రామ సచివాలయాల పక్కనే ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ తెలిపారు. రైతు భరోసా కేంద్రాల్లోనే రైతుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం తెలిపారు. రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఈ కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు.

రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో నాణ్యత తో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతులకు అందిస్తాయని జగన్ వివరించారు. వ్యవసాయం లో నూతన విధానాలను అందించేలా ఇవి సహాయపడుతాయన్నారు.

ఇక పశువులకు కూడా హెల్త్ కార్డులు జారీ చేస్తామని.. పంటలకు బీమా కార్డులు ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. పగటి పూటే రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు 1700 కోట్లతో ఫీడర్లను ఆధునీకరిస్తామన్నారు.
Tags:    

Similar News