చైనాలో మరో కొత్త కరోనా వైరస్.. మళ్లీ టెన్షన్

Update: 2020-04-02 05:25 GMT
చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ధాటికి ఇప్పటికే ప్రపంచం అల్లకల్లోలమైంది. దీన్ని అరికట్టడానికే ప్రపంచ దేశాలు పోరాడుతున్నాయి. ఇంకా మందు కూడా కనుక్కోలేదు.  ఇప్పుడు చైనాలో పరిస్థితులన్నీ కుదుటపడ్డాయి. వూహాన్ లో లాక్ డౌన్ ఎత్తివేశారు.

అయితే తాజాగా మరో ఉపద్రవం వచ్చిపడింది. కరోనా లక్షణాలైన జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ కేసులు బయట పడుతుండడంతో చైనాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. లక్షణాలు ఉన్న కేసులను గుర్తించవచ్చు. కానీ లక్షణాలు లేని వారిని ఎలా గుర్తు పట్టాలో తెలియక చైనా ఆపసోపాలు పడుతోంది. ఈ కొత్త రకం కేసులు ప్రపంచానికే సవాల్ విసురుతున్నాయి. విశాఖపట్నంలోనూ కరోనా లక్షణాలు ఏవీ లేకున్నా వారికి పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది.

కరోనా లక్షణాలు లేకపోవడంతో తమకేమీ కాలేదని చాలా మంది బయట తిరుగుతూ వందలాది మందికి వైరస్ అంటిస్తున్నారు. ఇది పెద్ద ప్రమాదానికి కారణమవుతోంది.

తాజాగా చైనా సాధారణ కేసులను, లక్షణాలు లేకుండా వచ్చిన కరోనా పాజిటివ్ కేసులను వర్గీకరించింది. ఈ తరహా లక్షణాలు బయటపడని కేసుల సంఖ్య దాదాపు 40వేల వరకు ఉండవచ్చని చైనా మీడియా తెలిపింది. చైనా సర్కారు మాత్రం వివరాలను గోప్యంగా ఉంచుతోంది. ఇక ఈ కేసులను చైనా లెక్కల్లో చేర్చకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇప్పటికే కరోనా లక్షణాలతో లక్షలమంది బాధపడుతుంటే చికిత్స చేయలేక వైద్యులు సతమతమవుతుంటే.. ఇలా లక్షణాలు లేనివారితో మరింత ప్రమాదమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News