కరోనా వైరస్ ను కట్టడి చేసే మరో ప్రయోగం సక్సెస్
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వైరస్ కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా వైరస్ ను కట్టడి చేసే కృత్రిమ ప్రోటీన్ లను తయారు చేశారు. కరోనా వైరస్ కు కారణమయ్యే సార్స్ కోవ్2 వైరస్ ను క్రియారహితంగా మార్చే కృత్రిమ పప్టైడ్ లను బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్.సీ) పరిశోధకులు తయారు చేశారు. వీటిని ఎస్ఐహెచ్ మినీ ప్రోటీన్ లుగా పేర్కొన్నారు. కరోనా వైరస్ మానవ కణజాలాల్లోకి ప్రవేశించకుండా ఇవి అడ్డుకుంటాయని పేర్కొన్నారు. వైరస్ కణాలను అడ్డుకోవడంతోపాటు వాటనన్నింటిని ఒక్క చోట చేర్చి శరీరంలో ఇతర అవయవాలకు సోకకుండా నిరోధిస్తామని వెల్లడించారు.
ప్రపంచ స్థితిగతులను మార్చిన కరోనా కేసులు ప్రస్తుతం పెరగకపోయినా కొత్త వేరియంట్ల ద్వారా చాపకిందనీరులా విస్తరిస్తోంది. ఒమిక్రాన్ రూపంలో వైరస్ సబ్ వేరియంట్లను సృష్టించుకు వెళ్తోంది. ఇప్పటి వరకు ఒమిక్రాన్ నుంచి బీ 2, బీఏ 4 వేరియంట్లు వచ్చాయి. తాజాగా బీఏ 5 విస్తరిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. బీఏ 2, బీఏ4 వేరియంట్లతో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. బీఏ 5తో రీ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయని అందోళన వ్యక్తమవుతోంది. దీంతో భవిష్యత్ లో కొవిడ్ మరెన్ని రూపాలు సంతరించుకుంటుందోనని చర్చించుకుంటున్నారు. అయితే వైద్య శాస్త్రవేత్తలు దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కొందరు సైన్స్ నిపుణులు సూచిస్తున్నారు.
ఇప్పటి వరకు వరకు వచ్చిన కొవిడ్ వేరియంట్లలో అనేక ఉపకరణాలకు దారి తీశాయి. గతంలో ప్రాణాలు బలితీసుకున్న డెల్టా వైరస్ లోనూ అనేక ఉపకరణాలు వచ్చాయి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఒమిక్రాన్ అంతకంటే ఎక్కువ రూపాంతరం చెందుతుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఒమిక్రాన్ నుంచి బీఏ 1, బీఏ 2 కొనసాగాయి. ఇప్పుుడు వాటి జాబితాలో బీఏ 1.1, బీఏ 3, బీఏ 4, బీఏ 5 కొనసాగుతున్నాయి. ఒమిక్రాన్ మిగతా వేరియంట్ల కంటే ఎక్కువగా వ్యాప్తి చెందుతుండడంతో కొత్త ఉపకరణాలు పొట్టుకొస్తున్నాయని అంటున్నారు. ఒక వేరియంట్ గణనీయ స్థాయిలోకి వెళ్లినప్పుడు దాని నుంచి భిన్న ఉపకరణాలు అనేకంగా వస్తాయి. అయితే వీటితో పెద్దగా ఇబ్బందులు ఉండవని అంటున్నారు. కానీ కొత్తగా పుట్టుకొచ్చే ఉపకరణాలపై అంచనా వేయలేమని చెబుతున్నారు.
గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 4518 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 25వేలు దాటేసింది. ఇక పాజిటివిటీ రేటు 1శాతం దాటేసింది. కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం పొంచి ఉందని మిశ్రా తెలిపారు. ప్రజలు అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
అయితే వచ్చే కొద్ది వారాల్లో కేసుల పెరుగుదలను భట్టి దీనిని నిర్దారించవచ్చు. అయితే మూడో టీకాతో ఒమిక్రాన్ తీవ్రతను అడ్డుకోవచ్చని పరిశోధనలు తేలాయని వైద్య శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.