• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఫ్లైట్ లో సీటు దొరకలేదన్న...

ఫ్లైట్ లో సీటు దొరకలేదన్న కోపంతో బాంబు వార్నింగ్ ఇచ్చాడు

By - Tupaki Desk
Update: 2021-03-29 09:30 GMT
కోపంతో చేసే పనులు నెత్తి మీదకు తీసుకురావటమే కాదు.. దిద్దుకోలేని తప్పులు చేసేలా చేస్తాయి. విచక్షణ మిస్ అయితే ఎలాంటి దారుణాలు చోటు చేసుకుంటాయనటానికి నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పాలి. గర్భవతి అయిన భార్యను చూసేందుకు బయలుదేరిన కాకినాడ కుర్రాడు.. కోపంతో చేసిన పనికి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. ఇంతకూ జరిగిందేమంటే.. కాకినాడకు చెందిన వీరేశ్ అనే 33 ఏళ్ల కుర్రాడు నాసిక్ లో ఇంజనీర్ గా పని చేస్తున్నాడు.  శనివారం రాత్రి 8.25 గంటలకు హైదరాబాద్ కు వెళ్లే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు.

అయితే.. అతగాడి టికెట్ పీఎన్ఆర్ నెంబరు అప్డేట్ కాలేదు. దీంతో.. ఎయిర్ పోర్టులుకు వెళ్లిన అతను.. ప్రయాణించటానికి వీల్లేదంటూ సిబ్బంది సూచించి.. మరో టికెట్ తీసుకోవాలని కోరారు. తన భార్య గర్భవతి అని..తాను వెంటనే వెళ్లాలని చెప్పినా.. ఏమీ చేయలేమని విమాన సిబ్బంది చెప్పటంతో కోపంతో రగిలిపోయాడు. ఎయిర్ పోర్టు నుంచి వెనక్కి బయలుదేరి అతను.. విమానం బయలుదేరటానికి 20 నిమిషాల ముందు నాసిక్ రూరల్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి.. విమానంలో బాంబు పెట్టినట్లుగా చెప్పి ఫోన్ పెట్టేశాడు.

దీంతో కంగారు పడిన  పోలీసులు.. ఎయిర్ పోర్టుకు సమాచారం అందించారు. దీంతో.. ప్రయాణికుల్ని వెంటనే విమానం నుంచి ఖాళీ చేయించిన అధికారులు.. విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. అయినా బాంబు జాడ దొరకలేదు. దీంతో..పోలీసులకు సమాచారం అందించిన ఫోన్ నెంబరు తీగ లాగితే.. వీరశ్ బొమ్మబయటకు వచ్చింది.విమానంలో తనను ప్రయాణించేందుకు అనుమతించని కోపంతో అలా బెదిరింపులకు దిగినట్లుగా తప్పు ఒప్పుకున్నాడు. గర్భవతిగా ఉన్న భార్యను చూసేందుక తపించి.. ఆగ్రహంతో లేని పోనితిప్పలు తెచ్చి పెట్టుకున్న అతడు ఇప్పుడు రిమాండ్ లో జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఆవేశం ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో ఈ ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి.
Tags:    
  • Nasik 
  • bomb warning 
  • Kakinada 
  • Telugu News 

Similar News

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS