నై అమ్రావతి : రాజధాని లెక్క ఇక తేలదు ?
జగన్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే కోర్టు ను పక్కదోవ పట్టిస్తుందా అంటే చెప్పలేం కానీ ప్రస్తుతానికి మాత్రం అయిష్టపూర్వకంగానే రాజధాని పనుల విషయమై ఉంది. ఎందుకని లక్ష కోట్లు వెచ్చించి ఇక్కడి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని గతంలో పలుసార్లు జగన్ అభిప్రాయపడ్డారు. ఆ అభిప్రాయానికే ఆయన కట్టుబడి ఉన్నారు. మరి! రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతున్న రాజన్న సర్కారులో రాజధాని రైతులకు భరోసా ఎలా దక్కుతుంది అన్నదే ఓ ప్రశ్నార్థకం. గతంలో కన్నా ఇప్పుడు భూముల విలువ పెరిగింది. ఇప్పటికే కొన్ని భూములు సీఆర్డీఏను తమ అవసరాలకు అనుగుణంగా వాడుకుని, సంబంధిత వ్యవస్థను పునరుద్ధరించారు జగన్.
ఆ విధంగా కొన్ని భూములు తనఖా పెట్టారు. రెండు వేల కోట్లు బ్యాంకుల నుంచి రుణం పొందారు. అయినా కూడా వీటిని కూడా కోర్టు అంగీకరించలేదు. రాజధాని కోసం సేకరించిన భూములు సంబంధిత పనులకే తప్ప ఇతర ఆర్థిక అవసరాల కోసం వాడుకోకూడదని తేల్చి చెప్పింది. దీంతో జగన్ మళ్లీ వెనక్కు తగ్గారు. ఆఖరికి కోర్టు మొన్నామధ్య అమరావతి రైతులకు అనుగుణంగా త్వరలోనే భూముల అభివృద్ధి, ఆగిన పనుల పూర్తి వంటివి చేపట్టాలని చెప్పినా అవి కూడా 3 రాజధానుల నినాదంలో కొట్టుకుపోయాయి. ఇప్పుడు కోర్టు ధిక్కార నేరం పూర్తిగా నిరూపణలో లేదు. ఎందుకంటే రాష్ట్ర సర్కారు తెలివిగా తప్పుకుంది. ఆర్థిక కారణాలే ఇందుకు కారణం అని చెప్పిపోయింది.
రాజధాని లెక్క ఇక తేలేది కాదనే తేలిపోయింది. హై కోర్టు చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం వినేందుకు పెద్దగా సుముఖంగా లేదు అని కూడా తేలిపోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇవాళ కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది జగన్ సర్కారుకు. దీంతో ఈ వివాదం మరింత ముదరనుంది. కేవలం ఆర్థిక సమస్యలనే సాకుగా చూపి జగన్ సర్కారు రాజధాని పనులు ఆపేయడం భావ్యం కాదని రాజధాని రైతులు కోర్టు గుమ్మం మళ్లీ ఎక్కారు. ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ నేరమే అవుతుందని వారు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన త్రి సభ్య బెంచ్ ఇరు వర్గాల వాదన విన్న మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమయిన సూచనలు చేస్తూ స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని కోరుతూ ఆదేశాలు ఇచ్చింది. వీటిపై కూడా జగన్ సర్కారు స్పందిస్తుందో లేదో ఇక ! కేసును జూలై 12కు వాయిదా వేస్తూ నిర్ణయం వెలువరించింది.