• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమరావతిపై అనుమానాలు...

అమరావతిపై అనుమానాలు క్లియర్

By - Tupaki Desk
Update: 2016-06-14 07:12 GMT
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిని ప్రపంచం ఆశ్చర్యపోయేలా నిర్మిస్తామని చంద్రబాబు చెబుతున్నా.. ఇంతవరకు పనులు మొదలు కాకపోవడంతో ఒకటే విమర్శలు. ఎప్పటికి పూర్తవుతుందో, ఎలా ఉంటుందో అంటూ పెదవి విరుపులు. అయితే.. అసలు రాజధాని పనులు మొదలు కాకపోయినా తాత్కాలిక సచివాలంగా వెలగపూడిలో నిర్మిస్తున్న భవనాల సంగతి చూస్తే మాత్రం చంద్రబాబు అనుకున్నట్లు అమరావతి నిర్మాణం కూడా అనుకున్నది అనుకున్నట్లు జరగడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. తాత్కాలిక సచివాలయాన్ని చూసినవారంతా ఇప్పటివరకు తాము చేసిన విమర్శలు కరెక్టు కాదేమోనన్న అభిప్రాయానికి వస్తున్నారు.

వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నిర్మాణం కొద్ది నెలల్లోనే పూర్తయిపోయింది. పనులు మొదలు పెట్టినప్పుడే పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు. పునాదులు ఎప్పటికి పూర్తి కావాలి.. లెంటెల్ స్థాయి ఎప్పటికి కంప్లీట్ కావాలి.. పైకప్పు ఎప్పుడు? ఏ అంతస్థు ఎప్పుడు? అనేది తేదీలతో సహా లక్ష్యాలు పెట్టుకున్నారు. దాని ప్రకారమే ఒక్కొక్కటీ పూర్తి చేశారు. దాంతో ప్రస్తుతం 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనాలు అందుబాటులోకి వచ్చేశాయి. ప్రస్తుతం ఫినిషింగ్ వర్క్  మాత్రమే మిగిలి ఉంది.

వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌ తో పాటు మొదటి అంతస్థును 12 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు. భవనాలను త్వరలో ప్రభుత్వానికి అప్పగించేందుకు ఎల్‌ అండ్‌ టి - షాపూర్జీ పల్లోంజీ సంస్థలు తుది మెరుగులు దిద్దుతున్నాయి.

- సచివాలయంలో ముఖ్యమంత్రి - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేషీలతోపాటు 25 మంది మంత్రులకు ఛాంబర్లు ఏర్పాటయ్యాయి.

- మొదటి అంతస్థు మొదటి భవనంలో ముఖ్యమంత్రి - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు - గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ (జీఏడి)ని - న్యాయశాఖ పరిధిలోని పది విభాగాలను 6వేల 850 చ.అడుగుల విస్తీర్ణం కలిగిన భవనంతోపాటు సీఎం సమావేశ మందిరం - బిల్డింగ్-2లో ఐదుగురు మంత్రుల ఛాంబర్లు ఫైనాన్స్ - ప్లానింగ్ విభాగాలు ఉంటాయి..

-  గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో మరో ఐదుగురు మంత్రుల పేషీలు - పరిశ్రమలు - మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ - పబ్లిక్ ఎంటర్‌ ప్రైజెస్ - హోంశాఖ కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు.

- బిల్డింగ్-3 మొదటి అంతస్థులో ఐదుగురు మంత్రుల పేషీలు - సాంఘిక సంక్షేమం - బలహీన వర్గాల సంక్షేమ శాఖ - మైనారిటీ సంక్షేమం - స్ర్తి - శిశు సంక్షేమ - స్కిల్ డెవలప్‌ మెంట్‌ కు సిద్ధం చేశారు. కాగా ఇదే భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో ఐటీ డిపార్టుమెంట్లు - సెంట్రల్ రికార్డు రూం - వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.

- బిల్డింగ్-4 మొదటి అంతస్థులో ఐదుగురు మంత్రులు - జలవనరులు - ఆర్‌ ఎస్‌ ఎడి - ప్రైమరీ స్కూల్ - హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగాలు - ఐటి అండ్ టీలను తరలిస్తారు. ఇదే భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో ఐదుగురు మంత్రులకు కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. అలాగే ఏహెచ్‌ డీడీఎఫ్ - సీఐఎస్ - సీఎస్ కార్యాలయాలు ఏర్పాటవుతాయి.

- బిల్డింగ్-5 మొదటి అంతస్థులో ఐదుగురు మంత్రుల కార్యాలయాలతో పాటు ట్రాన్స్‌ పోర్టు - రోడ్లు - భవనాలు - ఏపివీవీసి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇదే భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో సీఆర్ అండ్ ఆర్ అండ్ బీ - బీహెచ్‌ ఎం అండ్ ఎస్ డబ్ల్యు - ఎల్‌ ఈటి - హౌసింగ్ శాఖలకు కేటాయించారు.

కాగా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు - ఉప ముఖ్యమంత్రులిద్దరితో పాటు 17 మంది మంత్రులున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో ఐదుగురు మంత్రులకు పేషీలను ముందస్తుగా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో అనుసరించిన ప్రణాళిక.. అనుకున్నది అనుకున్నట్లు టైంకి పూర్తి చేయడం.. సకల సౌకర్యాలు కల్పించడం వంటివన్నీ చూసినవారు రాజధాని అమరావతివిషయంలోనూ అనుమానాలు అవసరం లేదన్న అభిప్రాయానికి వస్తున్నారు.

Tags:    
  • Andhra Secretariat Construction 
  • Telugu NEws 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS