అక్రమ సంతానం అమ్మకం.. విశాఖలో దారుణం

Update: 2020-07-27 05:00 GMT
విశాఖ జిల్లా వీ మాడుగుల మండలానికి చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల కిందట భర్త మరణించాడు. కానీ ఆమె గర్భం దాల్చింది.  ఎలా సాధ్యం అంటే.. అదే గ్రామానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడం వల్ల. ఈ విషయంలో అదే మండలానికి చెందిన ఆశావర్కర్లు వెంకటలక్ష్మీ, అన్నపూర్ణ గుర్తించారు. వెంకటలక్ష్మీ అల్లుడు రామకృష్ణ ద్వారా విశాఖలోని యూనివర్సల్ సృష్టి ఆసుపత్రి ఎండీ డాక్టర్ నమ్రతకు తెలిపాడు. దీంతో అక్రమ సంతానం అమ్మకం అనే రాకెట్  మొదలైంది.

అక్రమ సంతానం కలిగిన మహిళను ఆశా వర్కర్లు కలిసి  నీ పుట్టిన బిడ్డను తమకు ఇచ్చేస్తే కాన్పు ఖర్చులను తామే భరిస్తామని.. కొంత డబ్బు కూడా ఇస్తామని ఆశపెట్టారు. ఆమె అంగీకరించింది. మార్చి 9న ఆమె యూనివర్సల్ సృష్టి ఆసుపత్రిలో మగబిడ్డను ప్రసవించింది.

ఈ బిడ్డను కోల్ కతాకు చెందిన దంపతులకు విక్రయించారు. కోల్ కతాలోని బ్రాంచ్ ఆసుపత్రి ద్వారా పిల్లలు లేని విక్రయించారు.

అయితే మహిళా గర్భంతో ఉన్న సమయంలో ఐసీడీఎస్ ద్వారా పౌష్టికాహారం లభించేది. స్థానిక అంగన్ వాడీ టీచర్ సరోజిని ప్రతీ వారం అందించేంది. కాన్పు తర్వాత బిడ్డ గురించి ఆరాతీయగా ఆమె పొంతన లేని సమాధానం ఇవ్వడంతో చైల్డ్ లైన్ ఆస్పత్రికి ఫిర్యాదు చేసింది. వారు విచారణ చేపట్టగా అక్రమ సంతానం అమ్మేసినట్టు తేలింది.

పోలీసులకు ఫిర్యాదు చేయగా.. డాక్టర్ నమ్రత ఇలానే అక్రమ సంతానాలు.. పేదల బిడ్డలను అమ్మేస్తూ కొంత మంది ఏజెంట్లను పెట్టుకొని దందా నిర్వహిస్తున్నట్టు తేలింది. దీంతో ఆమెను కీలక నిందితులను అరెస్ట్ చేశారు.
Tags:    

Similar News