అమరావతిలో ''జపాన్‌'' బ్యాంకు

Update: 2015-07-07 05:59 GMT
పట్టువదలని విక్రమార్కుడి మాదిరి ఒకదాని తర్వాత ఒకటిగా జరుపుతున్న విదేశీ పర్యటనల ద్వారా ఏపీకి అందాల్సిన ఫలాలు త్వరలోనే అందుతాయా? అంటే అవుననే చెబుతున్నా తెలుగు తమ్ముళ్లు. గతంలో జపాన్‌ పర్యటన చేసిన చంద్రబాబు.. తాజాగా చేస్తున్న పర్యటన సందర్భంగా కొన్ని కీలకమైన ఒప్పందాలు కుదరనున్నట్లు చెబుతున్నారు.

ఏపీలోకొత్తగా ఏర్పాటు చేసే రాజధానిలో జపాన్‌కు చెందిన అత్యంత ప్రాచీన బ్యాంకుగా చెప్పే మిజుహో బ్యాంకు రానున్నట్లు చెబుతున్నారు. జపాన్‌ పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం కావటం..విదేశీ పెట్టుబడుల కోసం తీవ్రంగా కృసి చేస్తున్న నేపథ్యంలో..ఏపీ కొత్త రాజధాని అమరావతిలో తమ బ్యాంకును నెలకొల్పేందుకు బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసిఏట్లు చెబుతున్నారు.

అత్యంత ప్రాచీన బ్యాంకుతో పాటు.. జపాన్‌లో అతి పెద్ద బ్యాంకుల్లో రెండోదైన మిజుహో కానీ.. ఏపీకి తరలివస్తే.. అదో సానుకూలాంశంగా మారుతుందని చెబుతున్నారు. అమరావతిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలపై బ్యాంకు ప్రతినిధులు ప్రత్యేక ఆసక్తి ప్రదర్శిస్తున్నారని చెబుతున్నారు. చూస్తుంటే తాజా జపాన్‌ పర్యటన కాస్తంత వర్క్‌వుట్‌ అయ్యేటట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News