మాస్కులు ధరించాల్సిందే...గాలి అలాంటిది మరి !

దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకరమైన స్థాయిలో ఉంది అని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడిస్తోంది. నాణ్యతా ప్రమాణాలు దారుణంగా తగ్గిపోయాయని అప్రమత్తం చేస్తోంది.;

Update: 2025-12-13 23:30 GMT

దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకరమైన స్థాయిలో ఉంది అని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడిస్తోంది. నాణ్యతా ప్రమాణాలు దారుణంగా తగ్గిపోయాయని అప్రమత్తం చేస్తోంది. బయటకు రావాలంటే కచ్చితంగా మాస్క్ ధరించాలని అంటున్నారు. ఎయిర్ ఇండెక్స్ చూస్తే 349గా నమోదు అయింది అని అంటున్నారు. ఇక ఢిల్లీలోని అనేక కీలక ప్రాంతాలలో గాలి నాణ్యత చాలా ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఒక అయిదారు చోట్ల చూస్తే అది తీవ్ర స్థాయికి చేరుకుందని కూడా చెబుతున్నారు. దీంతో పాటుగా రానున్న రెండు రోజులలో మరింతగా గాలి నాణ్యత దిగజారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రోగాల బారిన :

గాలి పీలిస్తే చాలు జబ్బులు వస్తున్నాయని అంటున్నారు. నిజానికి గాలి నీరు స్వచ్ఛంగా ఉండాలి. అదే మనిషి బతికేందుకు ఆస్కారం కల్పిస్తుంది. అయితే నీరు కాలుష్యం అవుతోంది. ఇపుడు పీల్చే గాలి కూడా ఇంకా దారుణంగా దిగజారుతోంది. మరి మనిషి జీవించేది ఎలా అన్న చర్చ వస్తోంది. ఢిల్లీలో చూస్తే ప్రధానంగా గాలి కాలుష్యంగా మారడానికి కారణం రవాణా రంగమే అని అంటున్నారు.

కాలుష్యం అందువల్లనే :

వాయు కాలుష్యం ఎపుడూ అనేక రకాలుగా అధికం అవుతుంది. అందులో ప్రముఖ పాత్ర పోషించేది రవాణా వల్లనే. ఢిల్లీలో చూస్తే జాతీయంగా ముఖ్య కేంద్రం కాబట్టి రవాణా రంగం వల్లనే ఎక్కువగా కాలుష్యం వ్యాప్తి చెందుతోంది అని అంటున్నాఉర్. ఏకంగా 17 శాతం పైగా రవాణా రంగం వాటా వాయు కాలుష్యంలో ఉందని లెక్క తేల్చుతున్నారు. దీనితో పాటు నిర్మాణ రంగం వల్ల కూడా 2 నుంచి 3 శాతం, పరిశ్రమల వల్ల ఏకంగా 9 దాకా చెత్తను తెచ్చి తగలబెట్టడం వల్ల వచ్చే కాలుష్యం మరో రెండు శాతంగా ఉందని చెబుతున్నారు. అలాగే ఇతర కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

తగ్గించేది ఎలా :

బహుముఖీయంగా విస్తరిస్తున్న కాలుష్యాన్ని తగ్గించడం ఎలా అన్న చర్చ అయితే ఉంది. దీని మీద నిపుణులు తేల్చేది ఏంటి అంటే వాహన కాలుష్యం బాగా నియంత్రించాలని. అంటే వాహనాలలో వాటే ఇంధనం వల్ల ఉద్భవించే కాలుష్య కారకాలను తగ్గించాలని సూచిస్తున్నారు. అలాగే ఇతర రకాలుగా ఉన్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ కాలుష్యం ప్రాణం తీస్తోంది అని అంటున్నారు. దాంతో జనాలు జబ్బుల బారిన పడుతున్నారు. మరి కొన్నాళ్ళ పాటు జాగ్రత్తగా ఉండాలని బయటకు వస్తే మాస్కులను ధరించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News