అసెంబ్లీ సీట్లు పెరిగేది అపుడేనటగా !

ఏపీ తెలంగాణాకు విభజన చట్టం 2014లో ఉన్న హామీ మేరకు కచ్చితంగా సీట్లను పెంచాల్సి ఉంది. ఏపీకి అలా చూస్తే 50 సీట్లు కొత్తగా వస్తాయి. అలాగే తెలంగాణాకు 34 సీట్లు పెరుగుతాయి.;

Update: 2025-12-14 01:30 GMT

ఏపీ తెలంగాణాకు విభజన చట్టం 2014లో ఉన్న హామీ మేరకు కచ్చితంగా సీట్లను పెంచాల్సి ఉంది. ఏపీకి అలా చూస్తే 50 సీట్లు కొత్తగా వస్తాయి. అలాగే తెలంగాణాకు 34 సీట్లు పెరుగుతాయి. దాంతో తెలంగాణాలో ప్రస్తుతం ఉన్న 119 సీట్ల నుంచి 153 సీట్ల దాకా వస్తాయి. ఏపీలో 225 దాకా సీట్లు పెరుగుతాయి. అయితే ఈ సీట్ల పెరుగుదల ఎపుడు అన్నదే చర్చగా ఉంది. నిజంగా చూస్తే కనుక 2019 నుంచి దీని మీద ఏపీ తెలంగాణ రెండూ ఆశలు పెట్టుకుని ఉన్నాయి. కానీ 2024 లో కూడా పెరగలేదు ఇపుడు చూస్తే 2029 మీద టార్గెట్ పెట్టి అటూ ఇటూ కూడా రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి.

జనాభా గణన :

ఇక దేశవ్యాప్తంగా జనాభా గణనకు కేంద్రం షెడ్యూల్ ప్రకటించింది. తాజా కేబినెట్ సమావేశంలో జన గణన కోసం పన్నెండు వేల కోట్ల రూపాయలు దాకా కేటాయించింది. దాని ప్రకారం చూస్తే 2027 దాకా ఇదే కొనసాగే వీలుంది. ఇక దాని తరువాత కుల గణన కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేశాక మిగిలేది 2028 లో కచ్చితంగా ఏడాది టైం మాత్రమే. అంటే 2029 సార్వత్రిక ఎన్నికలకు పెద్దగా సమయం ఉండదు, ఇక నియోజకవర్గాల పునర్విభజన అంటే చాలా తంతు ఉంటుంది. దాంతో సమయం సరిపోదు అని అంటున్నారు.

లోక్ సభ సీట్లు కూడా :

కేవలం ఏపీ తెలంగాణా అసెంబ్లీ సీట్లు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా లోక్ సభ సీట్లు కూడా పెంచాల్సి ఉంది. ఇవన్నీ అతి పెద్ద కసరత్తుగా ఉంటుంది. దాంతో 2029 నాటికి పూర్తి అయ్యేది ఉండదని అంటున్నారు. దాంతో 2034 కి పొడిగిస్తారు అని అంటున్నారు. అంటే దేశవ్యాప్తంగా లోక్ సభ సీట్లు కానీ అలాగే ఏపీ తెలంగాణా అసెంబ్లీ సీట్లు కానీ పెంచి అమలు చేసేది 2034లో మాత్రమే అని ఒక ప్రచారం అయితే సాగుతోంది.

బీజేపీకి లాభం :

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. చాలా రాష్ట్రాలలో కూడా ఉంది. అయితే ఏపీ తెలంగాణాలలో మాత్రం పార్టీ పెద్దగా లేదు, తెలంగాణాలో కూడా ఇపుడు ఎలాంటి ఆశలు అయితే లేవు, ఏపీలో ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగానే ఉంది. దాంతో అసెంబ్లీ సీట్లు పెంచినా ఫలితం రాజకీయ లాభం నేరుగా తమకు దక్కదని కాషాయ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఈ ప్రక్రియ మరింతగా అంటే మరిన్నేళ్ళకు వాయిదా వేయవచ్చు అని అంటున్నారు.

టీడీపీ ఆశలు :

అయితే ఏపీలో టీడీపీ మాత్రం పెరిగే అసెంబ్లీ సీట్ల మీద ఆశలు ఎక్కువగానే పెట్టుకుంది అని అంటున్నారు. ఈ సీట్లు పెరిగితే కనుక కచ్చితంగా ఆశావహులకు అక్కడ అకామిడేట్ చేయవచ్చు అన్నది ఆ పార్టీ భావనగా ఉంది. అదే సమయంలో కేంద్రంలో తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉందని కాబట్టి 2029 నాటికి కచ్చితంగా 225 అసెంబ్లీ సీట్లను సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News