నా xపోస్టులు ఏమయ్యాయి?... ఇమ్రాన్ ఖాన్ భార్య ఆవేదన

నా భర్తను జైలులో ఒంటరిగా బంధించారు...ప్రపంచంతో సంబంధాలు కట్ చేశారు. లోపల ఎలా ఉన్నారో ఎవరికీ తెలీడం లేదు.;

Update: 2025-12-13 16:30 GMT

నా భర్తను జైలులో ఒంటరిగా బంధించారు...ప్రపంచంతో సంబంధాలు కట్ చేశారు. లోపల ఎలా ఉన్నారో ఎవరికీ తెలీడం లేదు. కనీసం xలో పోస్టులు పెడితే అవి కూడా మాయం అవుతున్నాయి. ఎందుకిలా జరుగుతోందో అర్థం కావడంలేదు. మాకు అంతా అంధకారమే...నాకున్న ఏకైక ద్వారం x...ఇక్కడి నా పోస్టులే ఇమ్రాన్ గురించి ప్రపంచానికి సందేశమిస్తున్నాయి. కానీ అవికూడా మాయమవుతున్నాయంటూ ఎలెన్ మస్క్ తో విన్నవించుకున్నారు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ స్మిత్. ఈ పోస్ట్ కు మస్క్ ను ట్యాగ్ చేశారు.

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి అడియాలా జైలులో ఇన్నారు. దేశ భద్రతా రహస్యాలు లీక్ చేశారని, ప్రధానిగా లభించిన బహుమతుల్ని అమ్ముకున్నారని ఇలా దాదాపు వంద కేసులు ఇమ్రాన్ పై విధించారు. తొలుత అవినీతి కేసుకు సంబంధించి ఇస్లామాబాద్ కోర్టు దోషిగా తేల్చి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. అప్పుడు లాహోర్ ఇమ్రాన్ నివాసంలో అతణ్ని అరెస్ట్ చేశారు. తదుపరి అయిదేళ్లపాటు ఏ పదవిలో ఉండకుండా నిషేధం విధించినట్లు తీర్పులో తెలిపారు. ఇటీవల ఆయన మరణించినట్లు సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఇమ్రాన్ మద్దతు దారులను కలిసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడమే ఈ రాద్ధాంతానికి కారణంగా నిలుస్తోంది.

షాఖానా కేసుకు సంబంధించి అరెస్టయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అటక్ జైలులో నిర్బంధించారు. అయితే రాజకీయ ఖైదీలకు ...అందులోనూ దేశ మాజీ ప్రధానికి కనీస వసతులు కూడా కల్పించకుండా చీకటి గదిలో పడేసినట్లు తెలుస్తోంది. ఏమాత్రం వెలుతురు లేని ఓ ఇరుకు గదిలో పురుగులు, ఈగలు ముసురుకుంటున్న పరిస్థితిలో నరక కూపంలో లాగా ఇమ్రాన్ మగ్గిపోతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ములాఖాత్ లు మొత్తం బంద్ చేసి అతణ్ని ఏకాకిగా అంతమొందించే కుట్రలు కొనసాగుతున్నాయని ఇమ్రాన్ వర్గీయుల ప్రధాన ఆరోపణ.

అయితే పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్య పుకార్త నేపథ్యంలో ప్రభుత్వం ఇమ్రాన్ సోదరి ఉజ్మాఖానుమ్ కు మాత్రమే ములాఖత్ కు అనుమతినిచ్చింది. జైల్లో ఇమ్రాన్ సురక్షితంగా ఉన్నట్లు సోదరి వెల్లడించాక బైట అతని కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు కాస్త శాంతించారు. అయితే ప్రభుత్వం ఎందుకింత వివక్ష ప్రదర్శిచిందంటూ రాజకీయంగా నాయకులు నిప్పులు చెరుగుతున్నారు.

ఇమ్రాన్ ఖాన్ 1996 తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పేరిట పార్టీ ప్రారంభించారు. రెండు దశాబ్దాలుగా రాజకీయంగా పలు పోరాటాలు చేశారు. 2018లో పాక్ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు 2022లో పార్లమెంటరీ విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. ఆ తర్వాత పలు అవినీతి, అధికార దుర్వినియోగ కేసులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత అరెస్టు అయ్యారు. అయితే నెలన్నర కాలంగా ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించి ఏ సమాచారం లేకపోవడంతో అతని కుమారులతోపాటు పార్టీ కార్యకర్తలు విపరీతంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ మాజీ బార్య జెమీమా గోల్డ స్మిత్ x అధినేత ఎలెన్ మస్క్ కు ఆవేదనాపూరితంగా పోస్ట్ పెట్టడం సర్వత్రా చర్చనీయంగా మారుతోంది.

Tags:    

Similar News