ఏపీ సర్కార్ కరోనా కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందంటే ?
కరోనా వైరస్ .. ఈ మహమ్మారి వెలుగులోకి వచ్చి నెలలు గడిచిపోతున్నా కూడా , ఆ మహమ్మారి పీడ మాత్రం తొలగిపోవడం లేదు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. ఈ సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. అలాగే వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా సాగుతున్నా కూడా దేశంలో కరోనా మహమ్మారి కేసులు ఏ మాత్రం తగ్గకపోవడం గమనార్హం. ఇదిలా వుంటే .. కరోనా విజృంభణ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అల్లాడిపోతోంది. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకున్నా కూడా ఇంకా కరోనా జోరు తగ్గడంలేదు.
ఇకపోతే ,రాష్ట్రంలో కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వం భారీగానే నిధులు ఖర్చు చేస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన 2020 మార్చి నుంచి ఇప్పటి వరకూ కరోనా ను అరికట్టడం కోసం 2,229 కోట్ల పైచిలుకు ఖర్చు పెట్టిందట. అత్యాధునిక మౌలిక వసతుల కల్పనతో పాటు కరోనా కేర్ కేంద్రాలు, ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌ల నిర్వహణ, వాటికి కావాల్సిన కిట్లు, మందులు, రసాయనాలు.. తదితరాలకు భారీగా ఖర్చుపెట్టాల్సి వచ్చింది. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే .. 2020 ఫిబ్రవరి 15 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క వైరాలజీ ల్యాబొరేటరీ కూడా లేదు. ఆ తర్వాత కరోనా వెలుగులోకి వచ్చిన కొత్త లో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి నమూనాలు పంపించాల్సిన పరిస్థితి. ఆ తర్వాత రాష్ట్రాల్లోనే లాబ్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాదాపుగా రోజుకి లక్షకి పైగా కరోనా నమూనాలని పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14 ల్యాబొరేటరీలను ఏర్పాటు చేశారు. గతేడాది అంటే ఫస్ట్ వేవ్ లో 18 వేల మంది సిబ్బందిని నియమించగా, సెకండ్ వేవ్ లో 19 వేల మందికి పైగా సిబ్బంది నియామకానికి ఆమోదం వచ్చింది. ఇప్పటికే 18 వేల మంది విధుల్లో చేరారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.