తెలంగాణా కు బిర్యానీ.. మరి ఏపీకి..?
హైదరాబాద్ అన్నంతనే బిర్యానీ గుర్తుకు వస్తుంది. మహానగరానికి వచ్చిన వారు ఎవరైనా సరే.. ఫుడ్ గురించి మాట్లాడాల్సి వస్తే.. బిర్యానీ ప్రస్తావన తేకుండా ఉండరు. హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రతిప్రముఖుడు బిర్యానీ టేస్ట్ చూడకుండా ఉండరు. హైదరాబాద్ కల్చర్ లో భాగమైన బిర్యానీ ఒక బ్రాండ్ గా మారిందని చెప్పాలి.
ఈ కారణంతోనే హైదరాబాద్ గురించి మాట్లాడేవారంతా బిర్యానీ గురించి ఒక మాట మాట్లాడకుండా తమ ప్రసంగాన్ని ముగించరు. మరి.. హైదరాబాద్ కు బిర్యానీ ఉన్నప్పుడు ఏపీకి సంబంధించి ఫుడ్ విషయంలో పోటీ పడేది ఏముందన్న ప్రశ్న రాక మానదు. ఇకపై అలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. ఎందుకంటే.. తెలంగాణ అన్నంతనే బిర్యానీ మాట ఎలా గుర్తుకు వస్తుందో.. ఏపీ అన్నంతనే.. బొంగు బిర్యానీ గుర్తుకు వచ్చేలా ప్రచారం షురూ చేయాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ గా బొంగు బిర్యానీని ప్రచారంలోకి తేవాలని డిసైడ్ అయ్యారు. హైదరాబాద్ అన్నంతనే బిర్యానీని ఎలా గుర్తుకు తెచ్చుకుంటారో.. ఏపీ అన్నంతనే బొంగు బిర్యానీ గుర్తుకు వచ్చే స్థాయిలో ప్రమోట్ చేయాలని డిసైడ్ అయ్యారు.
ఇందులో భాగంగా ఏపీలోని హోటళ్లలో పని చేసే చెఫ్ లకు ఈ బొంగు బిర్యానీని వండే విషయంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని డిసైడ్ చేశారు. ఆంధ్రా ఫుడ్ ను ప్రమోట్ చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. హైదరాబాద్‌కు బిర్యానీ ఉంది కాబట్టి.. ఏపీకి బొంగు బిర్యానీ అన్నట్లు కాకుండా.. ఏపీ మార్క్ ఫుడ్ ను పరిచయం చేసేలా ప్రయత్నించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పర్యావరణం గురించ పదే పదే మాట్లాడుతున్న ఈ రోజుల్లో బొంగుల్ని కాల్చటం ద్వారా తయారయ్యే బొంగు బిర్యానీ.. పర్యావరణ హితం ఎంతమాత్రం కాదన్నది మర్చిపోకూడదు. మరీ.. యాంగిల్ బాబు ఎందుకు మిస్ అయినట్లు..?