చప్పట్లతో వలంటీర్లకి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్ !
గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం జగన్ అభినందనలు తెలిపారు. తాడేపల్లిలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టి వారి సేవలను శ్లాఘించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యం సాకారం అయిందని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు చప్పట్లతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటర్లకు అభినందనలు తెలిపారు.
మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని గతేడాది గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్ ప్రారంభించారు. అలాగే సచివాలయ వ్యవస్థకు అంకురార్పణ చేశారు. ప్రభుత్వ సేవలన్నీ గ్రామాలు, వార్డు స్థాయిలోనే పొందేలా సచివాలయ వ్యవస్థను సీఎం జగన్ తీసుకొచ్చారు. అలాగే ప్రభుత్వ పథకాలను ఇంటి వద్దకే చేర్చేందుకు వలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఈ కార్యక్రమ నిర్వహణకు పిలుపునివ్వగా.. సరిగ్గా రాత్రి ఏడు గంటల సమయంలో ప్రతి చోటా ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలా కొనసాగించారు.
సచివాలయ సిబ్బంది, వలంటీర్ల ద్వారా తమ ఇంటి గడప వద్దనే అనేక ప్రభుత్వ ప్రయోజనాలు పొందిన కోట్లాది మంది సామాన్యులు మొదలు.. ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. సొంత ఊరు దాటి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, కేవలం తొమ్మిది నెలల్లోనే దాదాపు కోటి సంఖ్యలో ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం గమనార్హం. ముఖ్యమంత్రి జగన్ ఆలోచనల మేరకు రాష్ట్రంలో ఏడాది కిత్రం ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఇప్పుడు ఐఏఎస్‌ల శిక్షణలో ఒక పాఠ్యాంశం అయ్యేంతగా ప్రాచుర్యం పొందింది. ఈ వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ సైతం కొనియాడారు. కేంద్ర కేబినెట్ సెక్రటరీ కూడా అభినందించారు.