లాక్ డౌన్ సడలింపులపై ఆనంద్ మహీంద్రా ట్వీట్
ప్రముఖ పారిశ్రామికవేత్త , మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటారు. సమకాలీన పరిస్తితులపై ఆయన వేసే ట్వీట్లు.. సోషల్ మీడియా యోధులను తెలియపరిచే విధానం ఎంతో ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సమకాలనీ అంశంపై ఆనంద్ మహీంద్ర వేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ప్రతీసారి ఇలాంటి అంశాలపై ట్రెండింగ్ లో ఆయన ఉంటారు. తాజాగా ఆయన కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ పై చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది. దేశంలోని ప్రస్తుతం లాక్ డౌన్ పరిస్తితిని గుర్తు చేస్తూ ఒక ఫన్నీ వీడియోను ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు.
ప్రస్తుతం దేశంలోని సుమారు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా తీవ్రత తగ్గుతుండడంతో కొన్ని రాష్ట్రాలు సడలింపులు ఇస్తున్నాయి. లాక్ డౌన్ పట్ల పాలకులు వ్యవహరిస్తున్న తీరుపై ఆనంద్ మహీంద్రా తాజాగా వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ఒక ఫన్నీ వీడియోను షేర్ చేశారు.
ఈ ఫన్నీ వీడియోలో ఒక యువకుడు తలుపు గొళ్లానికి తాడు కట్టాడు. ఆ తాడుకు తాళం తగిలించి కిందకు, పైకి లాగుతున్నాడు. ఏం చేస్తున్నావని అడిగితే ‘లాక్ డౌన్’ అంటూ సమాధానమిచ్చాడు. ఈ వీడియో నవ్వులు పూయిస్తోంది. ఈ విధంగా పాలకులు ఎప్పుడు లాక్ డౌన్ ఎత్తివేద్దామా? అని ఆలోచిస్తున్నట్టుగా ఉందని వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు.
దీన్ని షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ‘ఏ కఠిన సందర్భంలోనైనా భారతీయులు హాస్యంగా మలుచుకోగలరు.. సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా మంచిది.. మానసికంగా ఎంతో స్వాంతన చేకూర్చుతుంది అని ట్వీట్ చేశారు.
Full View Full View Full View