అంబానీ దివాలా కేసులో ఊహించని ట్విస్టు!
అనీల్ అంబానీ దివాలా కేసులో ఊహించని ట్విస్టు చోటు చేసుకుంది. అనీల్ అంబానీ దివాల కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్టీఐ) కూడా ఇంప్లీడ్ అవ్వటంతో కథ కొత్త మలుపు తిరిగింది. 2012లో తన ఆర్ కామ్ వ్యాపర నిర్వహణ కోసం అనీల్ అంబానీ అప్పులు తీసుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే చైనాలోని మూడు బ్యాంకుల్లో 70 కోట్ల డాలర్లు అప్పు తీసుకున్నారు. అంటే మన కరెన్సీలో సుమారు అప్పట్లోనే రూ. 4 వేల కోట్లుంటుంది.
అయితే అప్పులు తీసుకునేటప్పుడు అనీల్ తన వ్యక్తిగత ఆస్తులను గ్యారెంటీగా పెట్టారు. తర్వాత జరిగిన పరిణామాల్లో వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో వ్యాపార విస్తరణ కోసమని ఎస్బీఐ దగ్గర కూడా భారీగానే అప్పు చేశారు. దీనికి కూడా తన ఆస్తులనే షూరిటిగా పెట్టారు. మొత్తం మీద కొంతకాలం తర్వాత వ్యాపారాలన్నీ నష్టాల్లో కూరుకుపోయాయి. దాంతో బ్యాంకులకు అప్పులు చెల్లించటం దేవుడెరుగా కనీసం వడ్డీలు కట్టే పరిస్ధితి లేకుండా పోయింది.
దాంతో వేరే గత్యంతరం లేక అనీల్ కోర్టులో దివాలా పిటీషన్ వేశారు. అయితే దీన్ని వ్యతిరేకించిన చైనాలోని మూడు బ్యంకులు ఏకమయ్యాయి. అప్పుల వసూళ్ళ కోసం ఏకమైన మూడు బ్యాంకులు అనీల్ పై లండన్ లో కేసు వేశాయి. కేసును సుదీర్ఘంగా విచారించిన తర్వాత అనీల్ ఆస్తులన్నింటినీ వేలం వేసి అప్పులు రాబట్టుకోవాలని తీర్పిచ్చింది. అనీల్ కున్న వ్యక్తిగత విమానాలు, కార్లు, బంగళాలు, భూములు, భవనాలు అన్నింటినీ వేలం వేసినా చైనా బ్యాంకుల అప్పు తీరదని తేలింది. ఏమి చేయాలా అన్న విషయం చైనా బ్యాంకులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాయి.
ఈ నేపధ్యంలోనే హఠాత్తుగా ఎస్బీఐ కూడా అనీల్ పై ఢిల్లీ కోర్టులో పిటీషన్ వేసింది. ఆస్తులు వేలం వేసి అప్పును రికవరీ చేసుకోవాలన్న చైనా బ్యాంకుల ప్రయత్నాలను ఆపాలంటూ కేసు వేసింది. ఎందుకంటే అనీల్ ఆస్తులను వేలం వేయగా వచ్చే మొత్తాన్ని చైనా బ్యాంకులు తీసుకుంటే తమ అప్పు ఎలా తీరుతుందన్నది ఎస్డీఐ వాదన. మరి ఈ పరిస్ధితులు ఏమి చేయాలో బ్యాంకులకు అర్ధం కావటం లేదు. వేల ద్వారా వచ్చిన మొత్తాన్ని అప్పుల నిష్పత్తి ప్రకారం నాలుగు బ్యాంకులు తీసుకోవాలా ? లేకపోతే ముందు ఎస్బీఐ తీసుకోవాలా ? అన్నది వివాదాస్పదంగా మారింది. సరే ఇదే విషయమై చైనా బ్యాంకులకు కూడా ఢిల్లీ కోర్టు నోటీసులిచ్చింది. ఇపుడు ఆ బ్యాంకులు ఏమంటాయో ? కోర్టు ఏమి చెబుతుందో చూడాల్సిందే.