అన్నట్టుగా పాతబస్తీ సెంటర్ కు వచ్చిన అమిత్ షా

Update: 2020-11-29 14:30 GMT
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుకున్నట్టే పాతబస్తీ సెంటర్ కు వచ్చారు. ఆదివారం చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని వారాసిగూడ నుంచి సీతాఫల్ మండి హనుమాన్ టెంపుల్ వరకు అమిత్ షా రోడ్ షో నిర్వహించారు.

ఈ రోడ్ షో అయిపోయాక.. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ ఆఫీసులో ఉండి సాయంత్రం 5 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్తారు.

హోంమంత్రి పర్యటన నేపథ్యంలో చార్మినార్ , పాతబస్తీలో భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి.

అమిత్ షాకు స్వాగతం పలికేందుకు కాషాయ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకులు సైతం అమిత్ షా వెంట ఉండి ర్యాలీలో పాల్గొన్నారు.
Tags:    

Similar News