ఢిల్లీ ఎయిమ్స్ ‌లో చేరిన అమిత్ షా !

Update: 2020-08-18 07:50 GMT
కేంద్ర హోంమంత్రి అమిత్ షా  ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఇప్పటివరకూ గురుగ్రామ్ వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేంద్ర మంత్రి అమిత్ షా తాజాగా ఢిల్లీ ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు. కరోనా బారి నుంచి కోలుకున్న అమిత్ షా శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రి మారినట్లు సమాచారం. ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి నుంచే అమిత్ షా విధులు నిర్వహించనునన్నారు. అమిత్ షాకు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా నేతృత్వంలోని వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా అమిత్ షా ఎయిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ కావడంతో ఆయన ఆరోగ్యానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు ఆరా తీశారు.

అమిత్ షాకు ఇటీవలే కరోనా సోకింది.. ఆగస్టు 2న పాజిటివ్ తేలింది. డాక్టర్ల సూచన మేరకు ఆయన గురుగ్రామ్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినట్టు ఈనెల 14న అమిత్ షా ట్వీట్‌ ద్వారా తెలియజేశారు. ఇప్పుడు శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఎయిమ్స్‌లో చేరారు. ఆయన ఆరోగ్యం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News