సంచలనం: కరోనాను దాచిపెట్టి చైనా మోసం చేసిందా?

Update: 2020-04-02 11:31 GMT
కరోనా వైరస్ తో అల్లకల్లోలంగా మారిన అమెరికా తాజాగా సంచలన ప్రకటన చేసింది. చైనా దేశం తమ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పరిధిని దాచిపెట్టిందని అమెరికా ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ తెలిపింది. అంతేకాదు.. వ్యాధి కేసులు, మరణాలను కూడా తక్కువగా చూపించిందని వైట్ హౌస్ నివేదికలో సంచలన నిజాలు వెల్లడించింది. ఈ నివేదిక రహస్యంగా ఉన్నందున ఇన్నాల్లు బయటపడలేదని తెలుస్తోంది.

కేసులు - మరణాలను చైనా ప్రపంచానికి తక్కువగా చూపించిందని అమెరికా నివేదిక బట్టబయలు చేసింది. చైనా చెప్పిన కరోనా కేసులు సంఖ్యలు నకిలీవని అభిప్రాయపడింది. ఈ మేరకు అమెరికా ఇంటెలిజెన్స్ రూపొందించిన నివేదిక ఇప్పుడు వైరల్ గా మారింది.

అమెరికాలో నమోదైన 2 లక్షల కేసులు - 4వేల మరణాల కంటే చైనాలోనే ఎక్కువ కేసులు - మరణాలు సంభవించాయని అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికలో ఉందట.. ఈ సందర్భంగా బుధవారం అధ్యక్షుడు ట్రంప్ సైతం చైనా వైరస్ డేటా తక్కువగా ఉన్నట్టు చెప్పడం విశేషం.  ఇక చైనా దేశం కరోనా మరణాలను ఎంతవరకు దాచిపెట్టిందో తెలిపే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తనకు రాలేదని ట్రంప్ సంచలన విషయం చెప్పాడు.

చైనాలో డిసెంబర్ లో కరోనా పుట్టలేదని.. అందుకు చాలా కాలం ముందు - వైరస్ వ్యాపించిందని.. కానీ డిసెంబర్ లోనే పుట్టిందని చైనా ప్రపంచానికి అబద్ధం చెప్పిందని వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ సంచలన విషయాన్ని బుధవారం లీక్ చేశారు.

దీంతో ప్రపంచానికి చైనా అబద్ధమాడి ఇప్పుడు కరోనా ప్రబలడానికి కారణమైందన్న కఠిన నిజం అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్టుతో బహిర్గతమైంది.


Tags:    

Similar News