పార్కిన్సన్ వ్యాధి.. టార్గెట్ వారే.. ఈ లక్షణాలు కనిపిస్తే తస్మాత్ జాగ్రత్త!
చాలామందికి నడిచేటప్పుడు కాళ్లు లాగడం అనేది కామనే.. కానీ ఈ వ్యాధి వచ్చిన వారికి తరచుగా కాళ్లు లాగడం అనే లక్షణాలు కనిపిస్తాయి.;
సాధారణంగా పార్కిన్సన్ వ్యాధి చాలామంది వృద్ధుల్లోనే వస్తుంది అనుకుంటారు. కానీ పార్కిన్సన్ వ్యాధి అనేది కేవలం వృద్ధుల్లోనే కాదు యువకుల్లో కూడా కనిపిస్తుంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వృద్ధాప్యంతో సంబంధం లేకుండా యువకులకు కూడా ఈ ప్రమాదం ఎక్కువ ఉంటుందని తెలియజేస్తున్నారు. 20 నుండి 40 ఏళ్ల లోపు యువకులలో కూడా ఈ పార్కిన్సన్ వ్యాధి సంకేతాలు కనిపిస్తున్నాయి. మొదట ఈ వ్యాధి పూర్తిగా అభివృద్ధి చెందక ముందే చిన్న చిన్న సంకేతాలను చూపిస్తుంది. కానీ దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు.దీన్ని చాలా మంది స్ట్రెస్ వల్ల వచ్చిందని అనుకుంటారు.
కానీ ప్రారంభంలో వచ్చే ఈ లక్షణాలే చాలా ముఖ్యమైనవని.వీటిని పరిగణలోకి తీసుకొని సకాలంలో వైద్యుడి దగ్గరికి వెళ్తే వ్యాధి నుండి బయటపడవచ్చు అని అంటున్నారు. పార్కిన్సన్ వ్యాధి యువకుల్లో ఎక్కువగా అటాక్ చేయడంతో యువతలో కాస్త ఆందోళన మొదలైంది.ఇండియా తో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో పార్కిన్సన్ కేసులు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. ఇందులో 42 నుండి 45% మంది భారతీయ రోగుల్లో 22 నుండి 49 సంవత్సరాల మధ్య వయసు గల వారేనని అంటున్నారు. మరి ఇంతకీ పార్కిన్సన్ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి..?ఈ వ్యాధి వచ్చే ముందు కనిపించే 4 ప్రారంభ సంకేతాలు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.
యువకులలో కనిపించే 4 ప్రారంభ సంకేతాలు ఏంటంటే..
చిన్న చేతివ్రాత:
మైక్రోగ్రాఫియా అని పిలవబడే చేతివ్రాత పరిమాణంలో అకస్మాత్తుగా తగ్గుదల ఏర్పడుతుంది. కానీ ఇలా జరిగితే చాలామంది స్ట్రెస్, అలసట వల్ల జరిగిందని భావిస్తారు. కానీ ఇది చేతి కదలికపై తగిన నియంత్రణను ప్రతిబింబిస్తుంది.
కదలడంలో లేదా నడవడంలో ఇబ్బంది పడడం :
చాలామందికి నడిచేటప్పుడు కాళ్లు లాగడం అనేది కామనే.. కానీ ఈ వ్యాధి వచ్చిన వారికి తరచుగా కాళ్లు లాగడం అనే లక్షణాలు కనిపిస్తాయి.
మృదువైనా లేదా తక్కువ స్వరం:
ఇది ప్రారంభ సాంకేతాలలో ముఖ్యమైనది.ఈ వ్యాధి వస్తే చాలామందిలో స్వరం తక్కువగా మారిపోతుంది. చాలామంది ఇది గొంతు నొప్పి కారణంగా వస్తుందని అనుకుంటారు. కానీ పార్కిన్సన్ వ్యాధి వచ్చిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
వణుకు :
రెస్ట్ తీసుకుంటున్న సమయంలో కూడా చేతులు లేదా వేళ్ళు స్వల్పంగా కదలడం అంటే వణుకు అనేది ప్రధాన లక్షణంగా చెప్పుకోవచ్చు.అయితే చాలామంది ఇది అందరిలో వచ్చేదే కదా అని సిల్లీగా తీసుకుంటారు.ఈ వణుకు అనే లక్షణం మొదట చిన్నగా అనిపించినప్పటికీ పోను పోను ఇది మరింత తీవ్రతరం అవుతుంది.
అయితే ఈ పార్కిన్సన్ వ్యాధి నుండి బయటపడడం కోసం వెంటనే డాక్టర్లను సంప్రదించి సరైన ట్రీట్మెంట్ చేయించుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రమం తప్పకుండా నాడీ సంబంధిత స్క్రీనింగ్లు చేయించుకోవాలని, శారీరక శ్రమను కొనసాగించాలని, నిరంతర లక్షణాలపై శ్రద్ధ వహించాలని,ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి వ్యాధి ఉంటే కచ్చితంగా ఒకసారి టెస్ట్ చేయించుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. పార్కిన్సన్ వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించడం వల్ల వ్యాధి తీవ్రత పెరగకుండా అది చాలా సహాయపడుతుందని,ఈ సంకేతాలలో ఏ ఒక్కటి ఉన్నట్టు అనుమానం వచ్చినా ఆలోచించుకుంటూ కూర్చోకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలని అంటున్నారు.