అమెరికా పంట పండుతోందా ?
ప్రపంచ ఆయుధాల వ్యాపారంలో అమెరికా పంట పండుతోంది. అనేక దేశాలకు అమెరికా తన ఆయుధాలను అమ్మేసుకుంటోంది. దేశాల మధ్య అభద్రత పెరిగిపోతుండటం తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చాలా దేశాలు ఆయుధాల కొనుగోళ్ళకు తొందరపడుతున్నాయి. ఈ అవసరాలనే అమెరికా సొమ్ముచేసుకుంటోంది. ప్రపంచదేశాల్లో అత్యధికం అమెరికా తయారుచేస్తున్న ఆయుధాలనే కొనుగోళ్ళు చేస్తున్నాయి. ఇందుకనే ప్రపంచ ఆయుధాల వ్యాపారంలో అగ్రరాజ్యం అమెరికా వాటా 40 శాతం.
అగ్రరాజ్యం తయారుచేస్తున్న ఆయుధాల్లో ప్రధానంగా మిస్సైళ్ళు, తుపాకులు, హెలికాప్టర్లు, ద్రోన్లు, మిస్సైల్ లాంఛింగ్ ప్యాడ్లుంటున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తమపైన కూడా రష్యా ఎక్కడ యుద్ధానికి దిగుతుందో అనే భయం చాలా యూరోపు దేశాల్లో పెరిగిపోయింది. దాంతో జర్మనీ, ప్రాన్ప్, పోలండ్, ఇటలీ, రుమేనియా లాంటి అనేక దేశాలు ఆయుధాల కొనుగోళ్ళు మొదలుపెట్టాయి. ఈ దేశాల్లోని భయాన్నే అమెరికా అడ్వాంటేజ్ తీసుకుంటోంది.
ఇపుడు రష్యాతో యుద్ధంచేస్తున్న ఉక్రెయిన్ కు అమెరికా ఆయుధాలు సప్లైచేస్తున్నా అదేమీ ఉచితంగా ఇస్తున్నది కాదు. ఇప్పటికే వేలకోట్లరూపాయల విలువైన ఆయుధాలను ఉక్రెయిన్ కు అందించింది. ఇక యూరోపు అవసరాలు ఇలాగుంటే భారత్ అవసరాలు మరోరకంగా ఉంటున్నాయి. పొరుగునే ఉన్న పాకిస్ధాన్, చైనాల ముప్పును ఎదుర్కొంటున్న కారణంగా గత్యంతరం లేక అత్యంత అధునాతన ఆయుధాలను కొనుగోళ్ళు చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకనే ముందుజాగ్రత్తగా వేలకోట్లరూపాయలు ఆయుధాలను కొంటోంది.
అయితే భారత్ కొనే ఆయుధాలన్నీ అమెరికా నుండే కాకుండా ఫ్రాన్స్, స్వీడన్, రష్యా నుండి కూడా కొంటోంది. అమెరికా తర్వాత అత్యంతాధునిక ఆయుధాలను తయరుచేస్తున్న దేశాలు రష్యా, ఫ్రాన్స్, చైనాలే. ప్రపంచదేశాలతో తన ఆయుధాలను కొనుగోళ్ళు చేయించేందుకోసం అమెరికా ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ టైగర్ టీమ్ ను ఏర్పాటుచేసుకున్నది. ఈ టీమ్ పనేంటంటే అన్నీ దేశాలు తిరుగుతు అమెరికా ఆయుధ వ్యాపారాన్ని పెంచటమే.