తమ్ముళ్లపై అంబటి సటైర్లు.. సభలో నవ్వులే నవ్వులు!
వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడటం.. అసలేం జరిగింది? జరిగిన దాన్లో ఏ అంశాన్ని పట్టించుకోవాలి? ఏ అంశాన్ని ప్రశ్నించాలి? మరే అంశాన్ని ప్రచారం చేయాలి? అన్న విషయాల్లో తమ్ముళ్ల లేమితనంపై జగన్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కడిగిపారేశారు. బాబు ఇమేజ్ ను ఎవరో డ్యామేజ్ చేయరని.. తెలుగు తమ్ముళ్లు చేసే తప్పులతోనే ఆయన ఇమేజ్ ఖరాబు అవుతుందన్న విషయాన్ని భలేగా చెప్పారు అంబటి.
టీడీపీ నేతలు పరమానందయ్య శిష్యుల తరహాలో నారానందయ్య శిష్యులు మాదిరి తయారైనట్లుగా వ్యంగ్య వ్యాఖ్యలు చేసి నవ్వులు తెప్పించారు అంబటి రాంబాబు. తాను టీడీపీ ఎమ్మెల్యేలను అవమానించాలనో.. అగౌరవ పర్చాలన్న ఉద్దేశంతోనో తానీ వ్యాఖ్యలు చేయటం లేదన్న ఆయన.. చంద్రబాబును గన్నవరం ఎయిర్ పోర్ట్ లో తనిఖీలు చేసిన అంశంపై టీడీపీ నేతల ప్రచారాన్ని ఆయన భారీ కౌంటర్లు వేశారు.
ఎయిర్ పోర్టులో బాబును తనిఖీ చేసినంతనే టీడీపీ నేతలంతా.. సుబ్బారావుగారూ.. మీ లీడర్‌కు అన్యాయం జరిగిపోయిందండీ.. వెంకటరావు గారూ.. మీ లీడర్ ను అవమానించారండీ.. అంటూ నిద్రపోయే వారిని లేవగొట్టి మరీ చంద్రబాబుకు అవమానం జరిగినట్లుగా చెప్పుకున్నారన్నారు.
నిజానికి చంద్రబాబుకు అన్యాయం జరగలేదు.. అవమానం జరగలేదు.. ప్రతిపక్ష నేతల విషయంలో ఎలాంటి రూల్స్ పాటించాలో అలాంటి రూల్సే సిబ్బంది ఫాలో అయ్యారు. అయినా.. ఇదేమీ పట్టించుకోకుండా పరమానందయ్య శిష్యుల మాదిరి ప్రతిచోటా ఇలా చెప్పుకోవటం వల్లే ఆయనకు అవమానం జరిగిందంటూ అసలు విషయాన్ని విడమర్చి చెప్పారు.
బాబు విషయంలో ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేది ఆయన ప్రత్యర్థులు కాదు..సొంతవాళ్లే అన్న విషయాన్ని అంబటి చెప్పిన తీరుకు సభానాయకుడు జగన్ విపరీతంగా నవ్వు తెప్పించింది. ఆ మాటకు వస్తే.. అంబటి వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించగా.. తెలుగు తమ్ముళ్లు ముఖాలు కందగడ్డ మాదిరి కందిపోయాయి.