టీడీపీ కాదది.. శునకానందం పార్టీ... !
ప్రతిపక్ష నేతపై కత్తితో దాడి జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చీమకుట్టినట్లు లేకపోగా తిరిగి హేళన చేస్తున్నారని వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు అన్నారు. తమ పార్టీని కోడి కత్తి పార్టీ అనడం చాలా దారుణం అన్నారు. తమ పార్టీకి పేర్లు పెట్టడం కాదని... అసలు తెలుగుదేశం పార్టీయే శునకానంద పార్టీగా మారిందని అంబటి విమర్శించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలది నీతిబాహ్యమైన పొత్తని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, టీడీపీలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయమై పునరాలోచన చేయాలన్నారు. పదవుల కోసమే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని, కానీ ప్రజల కోసం మాత్రం కాదని అంబటి రాంబాబు చెప్పారు.
మరోవైపు కాంగ్రెస్ - చంద్రబాబు పొత్తుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి కూడా విమర్శలు గుప్పించారు. వరుస ట్వీట్లతో ఆయన విరుచుకుపడ్డారు. ఆయన కూడా టీడీపీని శునకానంద పార్టీ అని.. చంద్రబాబును శునకానంద నాయుడని అన్నారు. 'చంద్రబాబు నాయుడు గారూ... మా పార్టీని మీరు కోడి కత్తి పార్టీ అంటూ దిగజారి శునకానందం పొందుతున్నారు. కాబట్టి, ఇక మీదట మీ పార్టీని మేం శునకానందం పార్టీగా పిలుస్తాం. మిమ్మల్ని శునకానంద నాయుడుగా పిలుస్తాం. సరేనా?' అంటూ ట్వీట్ చేశారు.
'ఐటీ సోదాల నుంచి రక్షణ పొందేందుకే చంద్రబాబు రాహుల్ తో రాసుకుపూసుకొని తిరుగుతున్నాడు. జాతీయ స్థాయి లీడర్ నని ఐటి శాఖను బెదిరించాలని చూస్తున్నాడు. చిదంబరం, రాబర్ట్ వద్రాలే అక్రమ సంపాదన కేసుల్లో ఇరుక్కుని ఉన్నారు. రాహులేం కాపాడతాడు?' అని ట్వీట్ చేశారు. , 'స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)లు -కమిషన్ లు చంద్రబాబు చెప్పినట్లుగా నివేదికలు ఇచ్చే వ్యవస్థలన్నది బహిరంగ రస్యం.అవి బాబు ‘సిట్'అంటే కూర్చుని,‘స్టాండ్'అంటే నిలబడి తమ వీరవిధేయతను ప్రకటిస్తాయి.సీఎంగా 14ఏళ్ళ హయాంలో బాబు వేసిన సిట్‌లు,విచారణలు ఉత్తిత్తివే అన్నది చారిత్రక సత్యం.' అని పేర్కొన్నారు.