‘అంబానీ’ నిర్భర భారత్!?

Update: 2020-08-25 04:00 GMT
‘అంతన్నాడు.. ఇంతన్నాడే మన మోడీజీ యవ్వారం అంతా కార్పొరేట్ మాయే’ అని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ఆడేసుకుంటున్నారు. తమ క్రియేటివిటీని రంగరించి మోడీ ‘కార్పొరేట్ మాయ’పై తెగ పోస్టులు పెడుతున్నారు. కార్పొరేట్ల కోసం ప్రభుత్వ రంగ సంస్థలను మోడీసార్ నిర్వీర్యం చేసేస్తున్నాడనే ఉదాహరణలు కూడా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

మోడీసార్ దేశంలో అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలు నీరుగారిపోయి కార్పొరేట్లకు పెద్ద పీట వేశారని.. చాలా వాటిని ప్రైవేటుపరం చేస్తున్నాడన్నది నెటిజన్ల ప్రధాన ఆరోపణ.. వాటికి పోటీగా ఉన్న ప్రైవేటు సంస్థలు దీని వల్ల లాభపడుతున్నాయన్నది వారి ఆవేదన..

రిలయన్స్ జియో కోసం బీఎస్ఎన్ఎల్ అంతర్థానమైపోయిందని.. రిలయన్స్ పెట్రోలియం కోసం బీపీసీఎల్ పోయిందని.. రిలయన్స్ ఇన్సూరెన్స్ కోసం ఎల్ఐసీ పోయిందని.. రిలయన్స్ గ్యాస్ కోసం ఓఎన్జీసీ పని ఖతమైందని.. రిలయన్స్ డిఫెన్స్ కోసం ‘హాల్’ను మడతేశారంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో మోడీ వ్యతిరేకవాదులు తెగ పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడిదీ వైరల్ అవుతోంది.

మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తోందని.. నీరుగారుస్తోందని ఫేస్ బుక్ లో సెటైర్లు వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వ సంస్థలన్నీ సర్వనాశనం అయ్యి సామాన్యులకు అందకుండా పోతున్నాయని.. అదే సమయంలో మోడీ హయాంలో వాటికి ప్రత్యామ్మాయమైన కార్పొరేట్ల బిజినెస్ లు  బాగా నడుస్తున్నాయని.. మోడీ కార్పొరేట్ దిగ్గజాలతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ మేధావులు, క్రిటిక్స్, నెటిజన్లు తెగ ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వైరల్ అవుతోంది.
Tags:    

Similar News