కరోనా పై సమీక్ష ..పాజిటివ్ కేసులన్నీ అక్కడే ?

Update: 2020-04-28 14:05 GMT
ఆంధ్రప్రదేశ్ లో కరోనా భాదితుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుండటంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పై , అలాగే నివారణ చర్యలపై సీఎం జగన్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. మంత్రి మోపిదేవి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతంసవాంగ్‌ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి వివరాలు అందించారు.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో ఏపీలో 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటివరకు 80వేల 334 పరీక్షలు చేయించామన్నారు. ప్రతి 10 లక్షల జనాభాకు 1504 చొప్పున పరీక్షలు చేయిస్తున్నామని అధికారులు వెల్లడించారు. పాజిటివ్‌ కేసుల సగటు దేశం మొత్తం 4.13 శాతం అయితే, ఏపీలో 1.57శాతం అని, అలాగే డెత్‌రేటు దేశం మొత్తం 3.19 శాతం అయితే మరణాల రేటు 2.46 శాతం అని వెల్లడించిన అధికారులు. కాగా ఈ కరోనా కేసులన్నీ కూడా కంటైన్‌మెంట్‌ జోన్ల నుంచే వస్తున్నాయని , గ్రీన్ జోన్స్ అన్నీ సేఫ్ గానే ఉన్నాయన్నారు.

అలాగే శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా ల్యాబ్ లు సిద్ధం అవుతున్నాయి అని , ఆ తరువాత విజయనగరం, ప.గో.జిల్లాల్లో ల్యాబ్ ల ఏర్పాటుపైనా దృష్టి పెడతాం అని , దానితో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ల్యాబ్ ఉంటుంది అని తెలిపారు. అలాగే , టెలిమెడిసిన్‌లో భాగంగా వైద్యం తీసుకుంటున్నవారికి మందులు కూడా సరఫరా చేసే విధానం సమర్థవంతంగా ఉండాలన్న సీఎం జగన్ అధికారులకి ఆదేశాలు జారీ చేసారు. అలాగే వ్యవసాయం అనుబంధ రంగాలపై సీఎం సమీక్ష జరిపారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులన్నీ బయట రాష్ట్రాలకు ఎగుమతులపైనే ఆధారపడి ఉంటుందన్న సీఎం, దీనిపై పత్యేక దృష్టిపెట్టాలని చూసించారు. బత్తాయి, అరటి రైతుల సమస్యలపైనా చర్చించారు. బయట రాష్ట్రాల్లో మార్కెట్లు తెరిచారా? లేదా? మన రాష్ట్రం నుంచి అక్కడకు రవాణా అవుతుందా? లేదా? అక్కడ విక్రయాలు ఎలా ఉన్నాయి? వాటి ధరలతో ప్రతిరోజూ సమీక్షా సమావేశానికి వివరాలతో రావాలని సీఎం జగన్‌ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
Tags:    

Similar News