పవన్ నా బెస్ట్ ఫ్రెండ్.....అక్కడ ఇద్దరం కలుస్తాం ఆలీ సంచలనం
టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాల నటుడిగా రంగ ప్రవేశం చేసి స్టార్ కమెడియన్ గా ఎదిరి హీరోగా మరో దశను చూసి క్యారక్టర్ అర్టిస్టుగా కూడా రాణించిన మేటి. ఇపుడు ఏకంగా ప్రొడ్యూసర్ అయ్యారు. ఒక సినిమా కూడా తాజాగా నిర్మిస్తున్నారు. అలాగే తెలుగులో ఒక ప్రముఖ చానల్ లో అలీ హోస్ట్ గా చేస్తున్న అలీతో సరదాగా సూపర్ డూపర్ హిట్ అయింది.
ఈ టాక్ షో కి ఎందరో దిగ్గజ నటులు సినీ టెక్నీషియన్స్ వచ్చారు. ఇదిలా ఉంటే అలీ తాను తొలిసారిగా నిర్మిస్తున్న అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. సహజంగానే అలీకి మీడియా నుంచి కొన్ని క్లిష్ట ప్రశ్నలు ఎదురయ్యాయి. హీరో కమ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ తో అలీ రిలేషన్స్ మీద మీడియా గుచ్చి గుచ్చి అడిగింది.
ఎందుకంటే ఏపీలో వైసీపీని లేకుండా చేయాలన్న పట్టుదలతో జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇక వైసీపీలో అలీ కీలకంగా ఉంటున్నారు. ఈ మధ్యనే ఆయనకు ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిని కూడా అప్పగించింది. క్యాబినెట్ ర్యాంక్ పదవి ఇది. ఆ విధంగా చూస్తే రాజకీయంగా పవన్ తో బద్ధ విరోధిగా ఉన్న వైసీపీలో అలీ ఉన్నట్లే. ఇక సినిమాల పరంగా చూస్తే రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పవన్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ అనే రెండు సినిమాలు చేశారు.
ఈ రెండిట్లో ఎక్కడా అలీ లేరు. నిజానికి పవన్ పాతికకు పైగా సినిమాల్లో నటిస్తే ప్రతీ దాంట్లో అలీ ఆయన పక్కన ఉన్నారు. ఇలా చూస్తే ఈ ఇద్దరు మధ్య గ్యాప్ బాగానే ఉంది అని అంతా అనుమానిస్తున్నారు. అదే మీడియా నుంచి ప్రశ్నగా అలీకి ఎదురైంది. అయితే దీనికి అలీ చాలా లైట్ గా తీసుకుని జవాబు చెప్పారు.
అంతే కాదు, తనకు పవన్ బెస్ట్ ఫ్రండ్ అని కూడా మరో మారు చాటుకున్నారు. పవన్ లేటెస్ట్ మూవీస్ లో తాను నటించకపోవడానికి ఆ మూవీస్ లో కామెడీకి ఎక్కడా స్కోప్ లేకపోవడమే తప్ప తమ మధ్య స్నేహమేదీ చెడిపోలేదని అలీ చెప్పారు. ఇక తాను చేస్తున్న అలీ తో సరదాగా షోకి తొందరలోనే పవన్ కళ్యాణ్ వస్తారని అలీ చెప్పి సంచలనం రేకెత్తించారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఏ టాక్ షోకి ఎపుడూ వచ్చిన సందర్భం లేదు.
అయితే అలీ మాత్రం కడు నమ్మకంగా చెబుతున్నారు. తమకూ పవన్ కి మధ్య మంచి బాండేజి ఉందని, అది అన్నింటికీ అతీతమని కూడా అంటున్నాడు. అంతే కాదు పవన్ తీరిక చేసుకుని తన టాక్ షోకి వస్తారని, అలా బుల్లి తెర మీద తాము ఇద్దరం కలసి సందడి చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. అదే టైం లో ఎన్ బీకే అన్ స్టాపబుల్ టాక్ షోకి పవన్ వెళ్తున్నారట అన్న దాని మీద తాను విన్నానని అలీ చెబుతూ తన షోకి మాత్రం కచ్చితంగా పవన్ రావడం ఖాయమని చెప్పేశారు.
అదే జరిగితే పవన్ ఫ్యాన్స్ తో పాటు అలీని అభిమానించే వారికి కూడా అది అద్భుతమైన షో అవుతుంది అనడంలో సందేహం లేదు. మరో వైపు చూస్తే అలీ ఆచీ తూచీ అన్నట్లుగానే మాట్లాడారు అని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం పదవి ఇచ్చినా తన సినీ స్నేహితుడు పవన్ విషయంలో మాత్రం ఎలాంటి గ్యాప్స్ లేకుండా చూసుకోవడానికే ఆయన ప్రయారిటీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
ఈ మధ్య అలీకి వైసీపీ పదవి ఇవ్వడంతో ఇంకేముంది అలీ పవన్ మీద ధాటీగా విమర్శలు చేస్తారు, విరుచుకుపడతారు అని ప్రచారం హోరెత్తించారు. అయితే అవన్నీ తప్పు అని చెప్పడానికే అలీ నుంచి ఈ రకమైన క్లారిటీ వచ్చింది అని అంటున్నారు. ఏది ఏమైనా అలీ పవన్ ఈ ఇద్దరూ బుల్లి తెర మీద కనిపిస్తే మాత్రం అది కనువిందే కానీ రాజకీయాలకు అతీతమైన సంచలనంగా నమోదు అవుతుంది అని చెప్పవచ్చు.