కూలిన విమాన శకలాలు ఇవ్వాలని అభ్యర్థిస్తున్న పాక్ ప్రభుత్వం

Update: 2020-05-28 17:30 GMT
పాకిస్తాన్‌ లో గతవారం నివాస ప్రాంతాల్లో ఓ విమానం కూలడంతో 97 మంది చనిపోయారు. విమానంలోని వారితో పాటు నివాస ప్రాంతంలో కూలడంతో స్థానికులు కూడా కొంతమంది మృత్యువాతపడ్డారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది.

విమానం కూలిన తర్వాత దాని శకలాలు చెల్లాచెదురయ్యాయి. ఆ శకలాలను స్థానికులు తీసుకెళ్లారు. స్థానికులు ఇలా తీసుకెళ్లిన వాటిలో ముఖ్యమైన పరికరాలు - వాయిస్ రికార్డర్ - ఇతర కీలక పరికరాలు ఉన్నాయట. ఎందుకంటే అధికారులకు దొరికిన శకలాల్లో అవి లేవు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం శకలాలు పట్టుకెళ్లిన వారికి.. వాటిని తెచ్చివ్వాలని విజ్ఞప్తి చేస్తోంది.

ఈ విమానాన్ని ఫ్రాన్స్ పదిహేనేళ్ల క్రితం తయారు చేసింది. ఈ విమానం కూలిన నేపథ్యంలో పాకిస్తాన్‌ తో పాటు ఫ్రాన్స్ విమానయాన సంస్థ కూడా దర్యాఫ్తు చేస్తోంది. దర్యాఫ్తులో భాగంగా ఘటనా ప్రాంతంలో పర్యటించింది. ఇదిలా ఉండగా, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ ను అధికారులు గుర్తించారు. కాక్‌ పిట్ వాయిస్ రికార్డర్ దొరకడంతో విచారణలో కీలకం కానుంది. పాక్‌ కు చెందిన ఇంటర్నేషనల్ ఎయిర్‌ లైన్స్ ఎయిర్‌ బస్ ఏ320 గత శుక్రవారం కరాచీ నగరంలో నివాస ప్రాంతాల్లో కుప్పకూలింది.
   

Tags:    

Similar News