విడుదలైన చింతమనేనికి షాకిచ్చిన పోలీసులు

Update: 2019-11-18 04:39 GMT
దాదాపు 67 రోజులు.. దెందలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జైల్లో ఉన్న రోజులు.. టీడీపీ ప్రభుత్వంలో ఉండగా పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోయిన ఆయనకు వైసీపీ ప్రభుత్వం రాగానే కష్టాలు మొదలయ్యాయి. ఆయన బాధితులంతా పోలీస్ స్టేషన్ గడప తొక్కారు. ప్రభుత్వం మారడంతో ఇన్నాళ్లు టచ్ చేయని పోలీసులు చింతమనేనిపై కేసులు పెట్టేశారు.. ఆయన జైలుకు పోవడం.. వరుసగా కేసుల మీద కేసులు బాధితులు నమోదు చేయడంతో 67రోజులు బెయిల్ దొరక్క జైల్లో ఉండిపోయారు చింతమనేని..

టీడీపీ హయాంలో దెందలూరు ఎమ్మెల్యేగా చింతమనేని ఆగడాలకు అధికారులు, ప్రజలు, బాధితులు కూడా బలయ్యారని కథలు కథలుగా చెబుతారు. వారంతా కేసులు పెట్టేసేరికి చింతమనేని ఉక్కిరిబిక్కిరయ్యారు.

అయితే ఫైన్ మార్నింగ్ చింతమనేనికి బెయిల్ వచ్చింది. 67 రోజుల సుధీర్ఘ జైలు జీవితానికి తాత్కాలికంగా స్వస్తి పడింది. దీంతో ఏలూరు జైలు నుంచి వచ్చిన చింతమనేని బయటకు రాగానే హీరో లెవల్లో ర్యాలీలు, మీడియా సమావేశం పెట్టి జగన్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టిపోశారు.

అయితే ఇక్కడే పొరపాటు చేశారు. జైలునుంచి విడుదలయ్యాక నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించారని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో చింతమనేనిపై కేసు నమోదైంది.  ఇప్పటికే దళితులను దూషించిన కేసులో అరెస్ట్ అయిన చింతమనేనిపై దాదాపు 18 కేసులు నమోదయ్యాయి. తాజాగా మరికొన్నింటిని యాడ్ చేసి పోలీసులు జలక్ ఇచ్చారు.
Tags:    

Similar News