పదేళ్ల కాపురం తర్వాత ఆమె కాదు అతడని తెలిసిందట
కొన్ని విషయాలు ఎంత చెప్పినా నమ్మబుద్ధి కాదు. లోతుల్లోకి వెళ్లి.. అన్ని విషయాలుతెలుసుకొని.. శాస్త్రీయంగా అదెంత వరకు నిజమన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కూడా నిజమని నమ్మే పరిస్థితి ఉండదు. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. ఎంతకూ మనసు అంగీకరించని పరిస్థితి. అలాంటి విచిత్రమైన ఘటన లోకి వెళితే..
పశ్చిమ బెంగాల్ కు చెందిన 30 ఏళ్ల యువతి అందరి లాంటి అమ్మాయే. ఎలాంటి అనారోగ్యం లేదు. సాధారణ జీవితం సాగించే ఆమె కు సుమారు పదేళ్ల క్రితం పెళ్లైంది. అప్పటి నుంచి పిల్లలు పుట్టలేదు. ఈ మధ్యన పొత్తి కడుపు నొప్పి వచ్చింది.దీంతో.. ఆమెను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలు చేసిన వైద్యులు అదిరిపడ్డారు. తాము తెలుసుకున్న విషయం నిజమా? కాదా? అని మరో సారి చెక్ చేశారు. చివరకు ఆమె మహిళ కాదని.. పురుషుడని తేల్చారు.
పైకి చూసేందుకు స్త్రీ లక్షణాలు ఉన్నప్పటికీ.. వృషణాలు శరీరం లోపలే ఉండిపోయాయి. దీంతో.. అతడు కాస్తా ఆమెగా మారింది. ఈ కారణంతోనే ఆమెకు నెలసరి రాలేదని చెప్పారు. వేలల్లో ఒకరికి ఇలాంటివి జరిగే అవకాశం ఉందన్నారు. చూసేందుకు మహిళ లక్షణాలు కనిపించినా.. సాంకేతికంగా మాత్రం పురుషుడే. భౌతిక లక్షణాలు మాత్రం మహిళలా ఉంటాయి. ఈ తీరును ఆండ్రోజెన్ ఇన్ సెన్సివిటీ సిండ్రోమ్ గా చెబుతున్నారు.
విచిత్రమైన విషయం ఏమంటే.. బాధిత మహిళ ఇద్దరు మేనత్తులు.. ఆమె చెల్లెలుకూడా చాలా కాలం తర్వాత పురుషులుగా తేల్చారు. దీంతో.. వారి కాపురం ఏమవుతుందన్నది ప్రశ్నగా మారింది. ఆమె పరిస్థితి గురించి భర్తకు వివరించి.. ఇరువురికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె అదేనండి అతడు టెస్టిక్యులర్ క్యాన్సర్ తో బాధ పడుతున్నాడు. దీంతో.. కీమోథెరపి ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పండి.. ఇంత చదివిన తర్వాత కూడా ఏదో తెలీని లోటుగా అనిపించట్లేదు?