అఫ్ఘానిస్థాన్‌ మొదటి మహిళా డైరెక్టర్ పై కాల్పులు !

Update: 2020-08-26 06:30 GMT
అఫ్ఘానిస్థాన్‌ లో తొలి మహిళా డైరెక్టర్‌, నటి 44 ఏళ్ల సబా సహార్ ‌పై గుర్తు తెలియని వ్యక్తులు  ఈ రోజు ఉదయం కాల్పులు జరిపారు. ఈ  సంఘటన జరిగిన వెంటనే ఆమె భర్త ఈమల్‌ జాకీ ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. సబా ఇంటి నుంచి బయలుదేరిన కాసేపటికే ముగ్గురు గన్ ‌మన్‌ లు కాల్పులు జరిపినట్లు భర్త ఈమల్ జాకీ తెలిపారు. అయితే ఇప్పటివరకు  ఎవరూ ఈ కాల్పులకు తామే బాధ్యులమని ప్రకటించలేదు. మహిళా హక్కుల కార్యకర్తగా, నటిగా, దర్శకురాలిగా, హోంశాఖలో ఉద్యోగిగా సబా సహారా తన భాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.  ఈ ఘటన పట్ల ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Tags:    

Similar News