• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తాలిబాన్ల తో ఆఫ్గాన్‌...

తాలిబాన్ల తో ఆఫ్గాన్‌ క్రికెట్.. ఎవరంటే?

By - Tupaki Desk
Update: 2021-08-21 08:30 GMT
ఆఫ్ఘన్ ని తాలిబాన్లు ఆక్రమించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశ భవిష్యత్‌ గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాలిబాన్లు కాబూల్‌ పట్టణంలో ప్రవేశించినప్పటి నుంచి చాలా మంది ఆఫ్ఘన్ పౌరులు దేశం విడిచి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. రాబోయే కాలంలో సాధారణ ప్రజల జీవితం ఎలా ఉంటుందనే దానిపై ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. అదే సమయంలో ఆ దేశ క్రీడాకారుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది.

ముఖ్యంగా ఆఫ్గాన్‌ క్రికెట్ జట్టు తక్కువ సమయంలో ఎక్కువ పేరు సంపాదించింది. అయితే తాలిబాన్ క్రికెట్ కార్యకలాపాలకు హాని కలిగించదని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ చెబుతున్నా ఈ ఫొటో మాత్రం పలు ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ మాజీ మీడియా మేనేజర్, జర్నలిస్ట్ ఇబ్రహీమ్ మొమాండ్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఫోటోను షేర్‌ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రధాన కార్యాలయంలో తాలిబాన్లు కూర్చుని ఉంటారు. వారితో పాటు ఆఫ్ఘనిస్తాన్ మాజీ బౌలర్ అబ్దుల్లా మజారీ కూడా ఉన్నాడని ఇబ్రహీం పేర్కొన్నాడు. మజారీ ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ కోసం 2 వన్డే మ్యాచ్‌ లు ఆడాడు.

తాలిబాన్లు దాదాపు మొత్తం ఆఫ్ఘనిస్తాన్‌ ని ఆక్రమించారు. ఇటీవల వారు ఎలాంటి విద్యా, సాంస్కృతిక లేదా క్రీడా కార్యకలాపాలను నిషేధించబోమని పేర్కొన్నారు. కానీ ఈ చిత్రం పలు ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు కూడా తాలిబాన్ పాలనలో ఉంటుందని భయపడుతున్నారు. రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ వంటి దేశంలోని అగ్రశ్రేణి క్రికెటర్లు ఇప్పటికే దేశంలోని పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే తాలిబాన్లు క్రికెట్‌ ని దెబ్బతీయరని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు CEO హమీద్ షిన్వారీ పేర్కొన్నారు. తాలిబాన్‌ లకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. వారు మొదటి నుంచి క్రికెట్‌ కి మద్దతు ఇచ్చారు. వారు మా కార్యకలాపాలలో జోక్యం చేసుకోరు. ఇప్పటివరకు నేను ఎలాంటి జోక్యాన్ని చూడలేదు. అయితే మా క్రికెట్ పురోగతి సాధించడానికి మద్దతు కోసం మాత్రం ఆశిస్తున్నాను. తదుపరి నోటీసు వచ్చేవరకు నేను సీఈఓగా ఉంటాను. తాలిబాన్ల కాలంలో క్రికెట్ అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చని అన్నారు.


Tags:    
  • Afghanistan 
  • Taliban 
  • Latest news 
  • Latest Updates 

Similar News

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS